దేశ రాజధాని ఢిల్లీ ఎన్ సీఆర్ లో రెసిడెన్షియల్ ఇళ్ల అమ్మకాల జోరు కొనసాగుతుంది. ఇక్కడ ఇళ్లకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. ముఖ్యంగా నోయిడాలో రియల్ బూమ్ ఎక్కువగా ఉంది. గోద్రేజ్ ప్రాపర్టీస్ నోయిడాలో 650 ఫ్లాట్ల అమ్మకం ద్వారా రూ.2వేల కోట్ల ఆదాయం సమకూరింది. నోయిడా సెక్టార్ 146లోని గోద్రేజ్ జర్దియానా ప్రాజెక్టులో 650 ఫ్లాట్ల అమ్మకం ద్వారా రూ.2వేల కోట్లు ఆర్జించినట్టు కంపెనీ ఓ ఫైలింగ్ లో పేర్కొంది.
‘అమ్మకాల పరంగా గోద్రజేప్ ప్రాపర్టీస్ అత్యంత విజయవంతమైన ప్రాజెక్టుల్లో ఇది ఒకటి’ అని కంపెనీ ఎండీ అండ్ సీఈఓ గౌరవ్ పాండే తెలిపారు. గోద్రేజ్ ప్రాపర్టీస్ కి నోయిడా అత్యంత ముఖ్యమైన మార్కెట్ అని పేర్కొన్నారు. నోయిడాలో తాము మరింతగా విస్తరిస్తామని చెప్పారు.