పశ్చిమ హైదరాబాద్‌లోని గేటెడ్ కమ్యూనిటీల్లో.. రెండు పడక గదుల ఫ్లాట్ కోసం ఎంతలేదన్నా కోటీ నుంచి కోటీ ఇరవై లక్షల దాకా పెట్టాల్సిందే. ట్రిపుల్ బెడ్రూమ్ అయితే కోటీన్నరకు పైగా అవుతుంది. కానీ, అంతంత రేటు పెట్టి కొనడమెందుకు అని ఆధునిక యువత భావిస్తోంది. వీరిలో కొందరికి సొంతిల్లు కాన్సెప్టు మీద నమ్మకం ఉండట్లేదు. అంతంత సొమ్ము పెట్టి ఫ్లాట్ కొనడం ఎందుకని భావిస్తున్నారు. అందుకే, అద్దె ఇళ్లల్లో నివసించడానికే ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నారు. సొంతిల్లు కొనాల్సి వస్తే.. మెరుగ్గా నిర్వహించే పాత గేటెడ్ కమ్యూనిటీల వైపు దృష్టి సారిస్తున్నారు. వీటిలో సగం రేటుకే ఫ్లాట్లు లభిస్తుండటమే ప్రధాన కారణం.
గచ్చిబౌలిలో కొత్త ఫ్లాటు కొనాలంటే ఎంతలేదన్నా కోటీన్నర దాకా అవుతుంది. కానీ, విప్రో చౌరస్తాలో ఉన్న మంత్రీ సెలస్టియాలో 1100 చదరపు అడుగుల ఫ్లాట్ కొనేందుకు రూ.90 లక్షలు పెడితే సరిపోతుంది. ప్రస్తుత అసోసియేషన్ ఇందులోని సౌకర్యాల్ని మెరుగ్గా నిర్వహిస్తుండటంతో.. చాలామంది ఇందులో ఫ్లాట్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే క్రమంలో మియాపూర్ విషయానికి వస్తే.. క్యాండియర్ 40, వర్టెక్స్ విరాట్, సాయివనమాలి వంటి కొత్త ప్రాజెక్టుల్లో డబుల్ బెడ్రూం ఫ్లాట్ కొనేందుకు కోటీ రూపాయలకు పైగా పెట్టాల్సి వస్తుంది. అదే, ఎస్ఎంఆర్ వినయ్ సిటీలో 75 లక్షలకు అటుఇటుగా డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ వచ్చేస్తుంది. ఈ కమ్యూనిటీ ప్రత్యేకత ఏమిటంటే.. ఐదున్నర ఎకరాల్లో కేవలం 512 ఫ్లాట్లను మాత్రమే నిర్మించారు. పైగా టూ బెడ్రూమ్ ఫ్లాట్ కొంటే 40కి పైగా యూడీఎస్ స్థలం వస్తుంది. పైగా అపర్ణా, మై హోమ్ వంటి బడా సంస్థలు నిర్మించే ప్రాజెక్టుల్లోనూ లేనివిధంగా.. ఇక్కడా మినీ క్రికెట్ గ్రౌండ్ ఉండటం విశేషం. దీంతో, చిన్నారులు, యువకులు నిత్యం క్రికెట్‌ని ఆస్వాదిస్తారు. అందుకే, ఇందులో ఫ్లాట్లను కొనేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.