పండగ వేళ రియల్ రంగం దూసుకెళ్తోంది. ఓ వైపు రూపాయి విలువ తగ్గడం, మరోవైపు ఎన్నారైల పెట్టుబడులు పెరగడం వంటి అంశాలు భారత రియల్ రంగం దూకుడుగా వెళ్లడానికి కారణాలుగా నిలుస్తున్నాయి. 2020 జనవరి-జూన్ కాలంతో పోలిస్తే 2022 అదే కాలంలో ఎన్నారైల సెర్చ్ ట్రాఫిక్ 117 శాతం పెరిగినట్టు అనరాక్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. భారతీయ ప్రాపర్టీ మార్కెట్ లో ఎన్నారైల పెట్టుబడులు గతేడాది ప్రథమార్ధంతో పోలిస్తే ఈ ఏడాది ప్రథమార్ధంలో 15 శాతం మేర పెరిగాయి.
ప్రస్తుతం పండగ సీజన్ నేపథ్యంలో ఎన్నారైల పెట్టుబడులు మరింత పెరుగుతాయని అంచనా. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతం నుంచి ఇవి ఎక్కువగా వస్తాయని భావిస్తున్నారు. ఇదే సమయంలో ప్రముఖ డెవలపర్లు బ్రిటన్, సింగపూర్, యూఏఈ, సౌదీ, ఆస్ట్రేలియాలోని ప్రవాస భారతీయులను ఆకర్షించడానికి ప్రాపర్టీ ధర తగ్గింపులు, పలు ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తున్నారు. హైదరాబాద్ లో కూడా ప్రాపర్టీ విక్రయాలు పెరిగాయి. ఎన్నారైలకు చక్కని గమ్యస్థానంగా హైదరాబాద్ ఉన్న నేపథ్యంలో పలువురు ప్రవాసులు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపిస్తున్నారు.
This website uses cookies.