ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లలో ముంబై అదరగొట్టింది. గతేడాది రికార్డు స్థాయిలో 1,26,907 యూనిట్లు రిజిస్ట్రేషన్లు జరిగాయి. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 4 శాతం అధికం. 2022లో 1,22,035 యూనిట్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. 2023లో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ల ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.10,869 కోట్ల ఆదాయం వచ్చింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 22 శాతం ఎక్కువ. ఒక్క డిసెంబర్ లోనే బృహన్ముంబై కార్పొరేషన్ పరిధిలో 12,255 యూనిట్లు రిజిస్టర్ అయ్యాయి. 2022 డిసెంబర్ లో 9,367 యూనిట్లు రిజిస్టర్ అయ్యాయి. మొత్తం రిజిస్ట్రేషన్లలో రెసిడెన్షియల్ వాటా 80 శాతంగా ఉంది.