61 శాతం సహోద్యోగులతో కలిసి పని చేస్తేనే మేలంటున్నారు..
జేఎల్ఎల్ తాజా సర్వే విశేషాలివే..
ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు పది దేశాలకు చెందిన ఉద్యోగులు.. 18 ఏళ్లు దాటినవారే.. వంద ఉద్యోగుల కంటే ఎక్కువ మంది గల సంస్థల్లో పని చేస్తున్నవారే.. 30 శాతం మంది చిన్నమధ్యతరహా సంస్థల్లో.. 70 శాతం మంది బడా కార్పొరేట్ సంస్థల్లో.. విధులు నిర్వహిస్తున్నవారే.. వీరంతా కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఏం చెబుతున్నారు? తమ ఆరోగ్య, మానసిక స్థితిగతుల్ని ఎలా విశ్లేషిస్తున్నారు? ఇల్లు మేలా? ఆఫీసు నయమా? అనే అంశాల్ని ఎలా భేరీజు వేస్తున్నారు? ఇలాంటి కీలక అంశాలపై జేఎల్ఎల్ నిర్వహించిన సర్వే కీలకాంశాలు మీకోసం..
ఉద్యోగులు తమ భవిష్యత్తు గురించి ఎలాంటి అంచనాలతో ఉన్నారు? ఉద్యోగి, యజమాని సంబంధం ఎలా ఉద్భవించిందని వీరు భావిస్తున్నారు? ఇంటి నుంచి పని చేయడం అలసటగా మారుతోందా? ఇంట్లో కూర్చోవడం వల్ల పని జీవిత నాణ్యతను మెరుగుపరిచిందా? ప్రయాణ సమయం నిజానికి మంచి విషయమా? ఇలాంటి అంశాల గురించి తెలుసుకునేందుకు నిర్వహించిన సర్వే ముఖ్యాంశాలివి.
మీ ఉద్యోగులు అత్యుత్తమంగా నిమగ్నమవ్వడానికి ఆఫీసే సరైన ప్రదేశం.. ఆఫీసు వాతావరణం అనేది అసాధారణమైనది. మీ ఉద్యోగులు సంక్షోభం నుండి బయటపడేందుకు సహాయపడటానికి ఆఫీసుకు ప్రధాన పాత్ర ఉంటుంది.
69% మంది ప్రజలు ఆఫీసులో పని చేయడమే సంతృప్తిగా భావిస్తున్నారు. ఆఫీసు వాతావరణాన్ని వీరు కోల్పోతున్నారు. అయితే 5% మాత్రమే ఇంట్లో ఉంటే ఉత్తమమని అనుకుంటున్నారు.
ఆఫీసు జీవితాన్ని చాలామంది కోల్పోతున్నారు. ఫలితంగా ఇంట్లో నుంచి పని చేయడం వల్ల అలసట పెరుగుతోంది. గత అక్టోబర్‌కు భిన్నంగా ఉద్యోగులు మరింత సమతుల్య పని విధానాలను ఆశిస్తున్నారు.
భవిష్యత్తులో వివిధ పని ప్రదేశాల్లో పని చేసుకునే ప్రత్యామ్నాయం ఉంటే ఉత్తమం అని 63 శాతం ఉద్యోగులు కోరుకుంటున్నారు.
కొత్త ఉద్యోగి ప్రాధాన్యత : వారానికి 3 రోజులు ఆఫీసులో పని చేయాలి. 2 రోజులు ఎక్కడ్నుంచి అయినా, 1.5 రోజు ఇంట్లో నుంచి, అర దినం మూడో ప్రదేశం ఎక్కడైనా.
ఇంట్లో నుంచి పని చేయడం వల్ల ఉత్పాదకత తగ్గుతోంది, ఉద్యోగుల కార్యాలయం కోసం కొత్త అంచనాలను పెంచుతుంది. ఉద్యోగుల సంఖ్యను పెంచడం కోసం ఆఫీసు ప్రయత్నిస్తోంది. నిర్దిష్టమైన పనికోసమే ఆఫీసులు అన్నది భవిష్యత్తుగా కనిపిస్తోంది.
48% 2020 ఏప్రిల్లో ఇంట్లో నుంచి పని చేయడం వల్ల ఉత్పాదకత ఉంటే, ఇది ప్రస్తుతం 37 శాతానికి పడిపోయింది.
47% ప్రస్తుతం మంది తమ కార్యాలయంలోనే సంతృప్తిగా ఉన్నారని చెప్పారు చెబుతున్నారు. సరిగ్గా ఏడాది క్రితం ఇది 63 శాతం ఉండింది. ఉద్యోగుల కొత్త అంచనాలకు తగ్గట్టుగా ఆఫీసులను రీడిజైన్ చేయాల్సిన అవసరముంది.
ఉద్యోగి ప్యాకేజీలో పని విధానాలు సరళంగా ఉండాలనే నిబంధన తప్పనిసరిగా మారింది. జీతం కంటే ముందు, పని-జీవితం మధ్య సమతుల్యత ఉండాలనే అంశానికి ప్రాధాన్యత పెరిగింది.
ప్రయాణంలో 79% సమయం ఆదా అవ్వడం వల్ల నాణ్యమైన జీవనాన్ని ఆస్వాదించడానికి కుదురుతుంది. అధిక విశ్రాంతి దొరుకుతుంది. కుటుంబ బాధ్యతలపై మరింత సమయాన్ని వెచ్చించే వీలుంటుంది.
88% మందికి భవిష్యత్తులో మరింత సౌకర్యవంతమైన పని గంటలు కావాలి.
ఇది సమయ నిర్వహణ మాత్రమే కాదు, సోషల్ ఇంటరాక్షన్ కూడా ముఖ్యమే. ఇంటి నుండి విస్తృతంగా పని చేసేటప్పుడు, రోజంతా ఆఫీసు పనుల్లోనే చిక్కుకున్నట్లు భావిస్తారు.
61% మంది సహోద్యోగులతో కలిసి మాట్లాడుతూ.. కలిసి మెలిసి పని చేయాలని కోరుకుంటున్నారు.
52% మంది ఈ అవకాశాన్ని కోల్పోతున్నారు.
రోజంతా పని చేయడం వల్ల మానసిక, సామాజిక సమస్యల్లో ఇరుకుపోవాల్సి వస్తోంది. తమ సంస్థ శారీరక, మానసిక మరియు సామాజిక ఆరోగ్యానికి మద్దతు ఇవ్వాలని అధిక శాతం ఉద్యోగులు కోరుకుంటున్నారు.
48% ఉద్యోగులు.. ఇంట్లో నుంచి పని చేయడం భారీ మానసిక భారంగా భావిస్తున్నారు.
58% ఉద్యోగులు.. ఆరోగ్యం మరియు శ్రేయస్సు కార్యక్రమాలకు తమ సంస్థ పెద్దపీట వేస్తే.. అందులోనే ఎక్కువ కాలం పని చేసే అవకాశం ఉంటుంది.
ఫ్లెక్స్-వర్క్ విధానాలు భారీగా ఉండాలి. యువ తల్లిదండ్రులు మరియు సంరక్షకుల అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి.
57% కొత్త ఉద్యోగులు ఒత్తిడిలో ఉన్నారు. ఇందులో సగం మంది తమ ఉద్యోగాల గురించి ఆందోళన చెందుతున్నారు.
57% యువ తల్లిదండ్రులు భారీ మానసిక సమస్యల్లో చిక్కుకున్నారు.