రూ.500 కోట్లతో కేటగిరీ- 1 ఆల్టర్నేటివ్
ఇన్వెస్ట్ ఫండ్ ఏర్పాటుకు నిర్ణయం
ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్ మెంట్ ట్రస్ట్ లిమిటెడ్ (ఐఐటీఎల్) అభివృద్ధి చెందుతున్న భారత రియల్ ఎస్టేట్ రంగంపై దృష్టి సారించింది. భారత్ లో కేటగిరీ 1 ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (ఏఐఎఫ్) ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. రూ.500 కోట్ల కార్పస్ ఫండ్ తో దీనిని ప్రారంభించనుంది. పటిష్టమైన హౌసింగ్ డిమాండ్, రికార్డ్-బ్రేకింగ్ ఆఫీస్ లీజింగ్, ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేస్‌ల పెరుగుదల, పెరుగుతున్న దేశీయ టూరిజం వంటి అంశాలతో రెసిడెన్షియల్, కమర్షియల్ రియల్ ఎస్టేట్ రెండింటిలోనూ వృద్ధిని ఉపయోగించుకోవడం ఈ ఫండ్ లక్ష్యం. ఐఐటీఎల్ ప్రస్తుత పెట్టుబడి పోర్టిఫోలియో రూ.405 కోట్లుగా ఉంది. రియల్ ఎస్టేట్‌పై ప్రత్యేక ప్రాధాన్యతతో బహుళ పారిశ్రామిక రంగాలలో విభిన్న పెట్టుబడులు పెట్టింది.
కొత్త ఏఐఎఫ్ వ్యూహాత్మకంగా టైర్-1, టైర్-2 నగరాలపై దృష్టి పెడుతుంది. అధిక-నాణ్యత నివాస, వాణిజ్య ప్రాజెక్టులను ఫలవంతం చేయడానికి ప్రముఖ గ్రేడ్-ఏ డెవలపర్లతో భాగస్వామం కలిగి ఉంటుంది. కాగా, ఐఐటీఎల్ ఇళ్ల కొనుగోలుదారులు, ప్రాపర్టీ అప్ గ్రేడర్లకు అందుబాటులో ఉన్న ఫైనాన్సింగ్ పరిష్కారాలను అందించడానికి ఓ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీని కూడా ప్రారంభిస్తోంది. ఈ అనుబంధ సంస్థ గృహ ఫైనాన్సింగ్ ఎంపికలను సులభతరం చేస్తుంది. ‘భారత రియల్ ఎస్టేట్ రంగం శక్తివంతమైన వృద్ధి పథంలో ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న గౌరవనీయమైన డెవలపర్లతో భాగస్వామ్యం పెంపొందించడంలో అపారమైన సామర్థ్యం కలిగి ఉన్నాం. ఈ ఏఐఎఫ్ ప్రారంభంతో పట్టణ విస్తరణ, స్థిరమైన అభివృద్ధికి మద్దతునిస్తూ మా వాటాదారులకు విలువ ఆధారిత పెట్టుబడి ఎంపికలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని ఐఐటీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బిపిన్ అగర్వాల్ పేర్కొన్నారు.
This website uses cookies.