కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన విధివిధానాలు దాదాపు కొలిక్కి వచ్చాయి. ఇతర రాష్ట్రాల్లో పేదల ఇళ్ల నిర్మాణాలకు ఆయా ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం పూర్తి చేసిన మన రాష్ట్ర అధికారులు.. దీనికి సంబంధించి ప్రభుత్వానికి తమ నివేదిక సమర్పించారు. వీటిని బట్టి త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన మార్గదర్శకాలు ఖరారు కానున్నాయి.
లబ్ధిదారుకు కనీసం 60 గజాల స్థలం ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించినట్టు సమాచారం. ఇంటి ప్లాన్ లబ్ధిదారు తన ఇష్టమొచ్చిన విధంగా రూపొందించుకోవచ్చు. అయితే, ఒక హాలు, బెడ్ రూమ్, కిచెన్, బాత్రూం తప్పనిసరిగా ఉండాలి. రాష్ట్రంలో ఒక్కో ఇందిరమ్మ ఇంటికి ప్రభుత్వం విడతల వారీగా రూ.5 లక్షలను అందించనుంది.
This website uses cookies.