Categories: LATEST UPDATES

ప్రభుత్వ ఉద్యోగులకు వడ్డీ రేటు 8 శాతమే

  • ఇంటి నిర్మాణ అడ్వాన్సు సైతం పెంపు
  • 3 లక్షల మందికి పైగా ఉద్యోగులకు లబ్ధి

ఉద్యోగులకు ఇచ్చే ఇంటి నిర్మాణ అడ్వాన్స్ (హెచ్ బీఏ) ను పెంచుతూ ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు హెచ్ బీఏ కింద రూ.25 లక్షలు ఇస్తుండగా.. ఇకపై రూ.40 లక్షల వరకు ఇవ్వనుంది. అంతేకాకుండా ఈ మొత్తానికి ఫ్లాట్ వడ్డీ రేటు 8 శాతం వర్తింపజేయాలని నిర్ణయించింది. దీనివల్ల దాదాపు మూడు లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. నిజానికి 201 నుంచి రూ.25 లక్షల వరకు రుణం తీసుకునేందుకు ఉద్యోగులు అర్హులుగా ఉన్నారు.

అయితే, తీసుకునే రుణ మొత్తం ఆధారంగా వడ్డీ రేటు ఉండేది. రూ.50వేల వరకు రుణాలకు 6 శాతం వడ్డీ ఉండగా.. రూ.25 లక్షలకు 11.5 శాతం వడ్డీ ఉంది. తాజాగా ఇందులో మార్పులు చేశారు. రూ.40 లక్షల వరకు ఎంత మొత్తం తీసుకున్నా 8 శాతం వడ్డీ రేటు వర్తించనుంది. ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈ రుణం తీసుకునేందుకు అర్హులని.. 60:40 నిష్పత్తిలో రెండు దఫాలుగా రుణమిస్తారని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ఇచ్చే హెచ్ బీఏ వడ్డీని 7.1 శాతానికి తగ్గించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ మేరకు నిర్ణయం తీసుకుందని ఓ అధికారి వెల్లడించారు.

This website uses cookies.