భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. ప్లాట్లలో పెట్టుబడి పెట్టాలని చాలామంది భావిస్తారు. కానీ, ఎక్కడ పెట్టుబడి పెడితే ఊహించిన దానికంటే అధిక అప్రిసీయేషన్ లభిస్తుందనే విషయాన్ని కొందరు అంచనా వేయలేరు. రేటు తక్కువుందనో.. ఫ్రెండ్ కొన్నాడనో.. బంధువులు సజెస్ట్ చేశారనో.. ఎక్కడ పడితే అక్కడ ప్లాట్లను కొంటుంటారు. ఎలాంటి రిసెర్చ్ లేకుండా, వెనకా ముందు ఆలోచించకుండా.. ఉన్న డబ్బంతా తీసుకెళ్లి ఎక్కడో ఒక చోట పెట్టేసి చేతులు దులిపేసుకోవడం ఇన్వస్ట్‌మెంట్ పెట్టే విధానం కాదు.
రియల్ ఎస్టేట్ రంగం ప్రాథమిక సూత్రం ఏమిటంటే.. ప్రతిఏటా ఒక కిలోమీటర్ చొప్పున నగరం విస్తరిస్తుంది. కాబట్టి, ఇప్పుడున్న నివాసయోగ్య ప్రాంతం నుంచి ఎంత దూరంలో మనం ప్లాట్లు కొంటున్నామనే విషయాన్ని పక్కాగా తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలి. జాతీయ రహదారి లేదా రాష్ట్ర రహదారి మీద ఎవరైనా మీకు వెంచర్ చూపిస్తే.. ప్రస్తుతమున్న నివాసయోగ్య ప్రాంతాల నుంచి ఆ వెంచర్ ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉందనే విషయాన్ని గమనించాకే తుది నిర్ణయానికి రావాలి.
ప్లాట్లలో పెట్టుబడి పెట్టాలని భావించేవారికి హైదరాబాద్‌లో అనేక ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో వె. స్ట్ హైదరాబాద్ ఒక చక్కటి ఆప్షన్. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్టుకు చేరువగా ఉండే మోకిలా, శంకర్‌పల్లి, చేవేళ్ల, మన్నెగూడ, వికారాబాద్ వంటివి చక్కటి ఆప్షన్ అని చెప్పొచ్చు. ధర విషయానికి వస్తే.. ప్రాంతాన్ని బట్టి గజానికి పది వేల నుంచి 60 వేల వరకూ రేటు పలుకుతోంది. 111 జీవోను ఎత్తివేశారని కొందరు సంబరపడుతూ ప్లాట్లను కొంటున్నారు.
అలా కాకుండా, మాస్టర్ ప్లాన్ వచ్చిన తర్వాత అక్కడ ప్లాట్లు కొనడం బెటర్. శంషాబాద్ విమానాశ్రయం చేరువలో ప్లాట్లు కొనాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు. బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే, సాగర్ హైవే తదితర రహదారుల్లోని కొన్ని ప్రాంతాల్లో గజానికి పది వేలకు దొరికే ప్లాట్లు ఉన్నాయని మర్చిపోకండి. కాస్త బెటర్ లొకేషన్లు అయితే రేటు కాస్త ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. పటాన్ చెరు, కంది, సంగారెడ్డి వంటి ప్రాంతాల్లో ప్లాట్ల ధరలకు రెక్కలొచ్చాయి. మేడ్చల్ హైవేలో తూప్రాన్ వరకూ నగరంలో కలిసిపోయిందనే చెప్పాలి. యాదాద్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటీవల మార్కెట్ కాస్త డల్‌గా ఉందనే చెప్పాలి.
This website uses cookies.