poulomi avante poulomi avante

పెట్టుబడులు పడిపోయాయ్

2023 చివరి త్రైమాసికంలో 37 శాతం తగ్గిన పెట్టుబడులు

గతేడాది మొత్తంగా 10 శాతం వృద్ధి

దేశ రియల్ రంగంలో సంస్థాగత పెట్టుబడులు 2023 చివరి త్రైమాసికంలో భారీగా తగ్గిపోయాయ్. 2022లో అదే సమయంలో 129.94 కోట్ల పెట్టుబడులు రాగా, 2023 క్యూ4లో 37 శాతం తగ్గి 82.23 కోట్ల డాలర్లకు పరిమితమైనట్టు ప్రముఖ రియల్ రంగ కన్సెల్టెంట్ సంస్థ కొలియర్స్ వెల్లడించింది. ఆఫీసు సెగ్మెంట్ లో కూడా 23 శాతం తగ్గిపోగా.. హౌసింగ్ విభాగంలో అత్యతధికంగా 79 శాతం పడిపోయి 8.1 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి.

2022 క్యూ4లో ఇవి 37.91 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. అలాగే ప్రత్యామ్నాయ ఆస్తుల కేటగిరీలోకి వ్చే డేటా సెంటర్లు, లైఫ్ సైన్సెస్, సీనియర్ హౌసింగ్ హాలిడే హోమ్స్, హాస్టళ్లు, స్కూళ్లు తదితరాల్లో సంస్థాగత పెట్టుబడులు 11 శాతం మేర తగ్గాయి. 2022 క్యూ4లో ఈ పెట్టుబడులు 49.79 కోట్ల డాలర్లు రాగా, 2023 క్యూ4లో 41.87 కోట్ల డాలర్లకు పడిపోయాయి. ఇండస్ట్రియల్‌, వేర్‌హౌసింగ్‌ ఆస్తుల విభాగాలలో పెట్టుబడులు 16 శాతం వెనకడుగుతో 18.71 కోట్ల డాలర్లకు చేరగా.. 2022 క్యూ4లో 22.2 కోట్ల డాలర్ల నిధులు వచ్చాయి. మిశ్రమ వినియోగ ప్రాజెక్టులకు 2023 చివరి త్రైమాసికంలో ఎలాంటి పెట్టుబడులు లభించలేదు.

గతేడాది అక్టోబర్‌-డిసెంబర్‌లో 5.49 కోట్ల డాలర్లు నమోదయ్యాయి. మొత్తంగా గతేడాది రియల్టీ రంగంలో సంస్థాగత పెట్టుబడులు 10 శాతం వృద్ధితో 538.40 కోట్ల డాలర్లను తాకాయి. 2022లో ఇవి 487.79 కోట్ల డాలర్లు మాత్రమే. ఆఫీస్‌ విభాగం 302.25 కోట్ల డాలర్ల పెట్టుబడులు(53 శాతం వాటా)తో తొలి స్థానంలో నిలిచింది. 2022లో 197.83 కోట్ల డాలర్లు వచ్చాయి. హౌసింగ్‌ విభాగంలో 20 శాతం అధికంగా 78.89 కోట్ల డాలర్లు లభించగా.. అంతక్రితం 65.56 కోట్ల డాలర్ల పెట్టుబడులు నమోదయ్యాయి. ఇండస్ట్రియల్‌, వేర్‌హౌసింగ్‌ ప్రాజెక్టులలో రెట్టింపై 87.76 కోట్లను తాకగా.. 2022లో కేవలం 42.18 కోట్ల డాలర్ల పెట్టుబడులు తరలి వచ్చాయి. ప్రత్యామ్నాయ ఆస్తులలో పెట్టుబడులు 25 శాతం క్షీణించి 64.91 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి.

మిశ్రమ వినియోగ ప్రాజెక్టులకు 91 శాతం తక్కువగా 4.23 కోట్ల డాలర్లు అందగా.. 2022లో 46.37 కోట్ల డాలర్ల పెట్టుబడులు నమోదయ్యాయి. 2023లో రిటైల్‌ ఆస్తులకు పెట్టుబడులు లభించకపోగా.. 2022లో ఈ విభాగానికి 49.18 కోట్ల డాలర్ల పెట్టుబడులొచ్చాయి.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles