Categories: TOP STORIES

ఇన్వెస్టర్లు గాయ‌బ్‌!

బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఉన్నంత వ‌ర‌కూ.. హైద‌రాబాద్‌లో ఇన్వెస్ట‌ర్లు ఎక్కువ‌గా దృష్టి సారించేవారు. అప్ప‌టి గ‌వ‌ర్న‌మెంట్ క్రృత్రిమ హైప్ కార‌ణంగా అనేక‌మంది పెట్టుబ‌డిదారులు న‌గ‌రంలో ప్రీలాంచుల్లో మ‌దుపు చేసేవారు. లాభాలొచ్చే ప్రాజెక్టుల్లోనే ఫ్లాట్ల‌ను కొనుగోలు చేసేవారు. జాతీయ‌, అంత‌ర్జాతీయ ఇన్వెస్ట‌ర్లు పెట్టుబ‌డులు పెట్టేవారు. అయితే, కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డం.. గ‌త ప్ర‌భుత్వ స్కీముల‌ను రివ‌ర్స్ చేయ‌డంతో.. ఇన్వెస్ట‌ర్లు వెన‌క‌డుగు వేయ‌డం ఆరంభించారు.

ముఖ్యంగా, రాయ‌దుర్గం నుంచి ఎయిర్‌పోర్టు మెట్రో మార్గం.. ఫార్మా సిటీ ర‌ద్దుతో.. పెట్టుబ‌డిదారులు హైద‌రాబాద్ నుంచి దాదాపుగా నిష్క్ర‌మించారు. ఇప్ప‌టికే, రెండు నుంచి నాలుగు ఫ్లాట్ల‌ను కొన్న ఇన్వెస్ట‌ర్లు ఏం చేయాలో అర్థం కాక త‌ల ప‌ట్టుకుంటున్నారు. మొత్తానికి, హైద‌రాబాద్ నిర్మాణ రంగం ఎప్పుడు గాడిలో ప‌డుతుందా? అని ఇన్వెస్ట‌ర్లు ఎదురు చూస్తున్నారు.

This website uses cookies.