సివిల్ ఇంజినీరింగ్ చదివే విద్యార్థులకు ప్రాక్టీకల్ శిక్షణను అందించేందుకు క్రెడాయ్ పుణె ఛాప్టర్ నడుం బిగించింది. ఈ క్రమంలో వీఐఐటీ కళాశాలతో ఒక ఒప్పందాన్ని తాజాగా కుదుర్చుకుంది. ఇందులో భాగంగా సివిల్ ఇంజినీరింగ్ చదివే విద్యార్థులకు నిర్మాణ ప్రాజెక్టుల్లో ప్రాక్టీకల్ శిక్షణను అందజేస్తారు. క్రెడాయ్ పుణె అధ్యక్షుడు రంజిత్, వీఐఐటీ మెనేజింగ్ ట్రస్టీ భరత్ అగర్వాల్‌లు కలిసి ఇటీవల ఎంవోయూ మీద సంతకం చేశారు.
ఈ సందర్భంగా రంజిత్ మాట్లాడుతూ.. గత కొన్నేళ్ల నుంచి పుణెలో నిర్మాణ రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. భవిష్యత్తులోనూ కొనసాగే ఈ వృద్ధికి సుశిక్షితులైన ఇంజినీర్ల సేవలెంతో అత్యవసరమని తెలిపారు. సివిల్ ఇంజినీరింగ్ చదువుకునే సమయంలోనే ప్రాజెక్టు సైటులో శిక్షణను పొందే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.
This website uses cookies.