Categories: LATEST UPDATES

వాసవి గ్రూపుపై ఐటీ దాడులు?

హైదరాబాద్ కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన వాసవి గ్రూపుపై ఐటీ దాడులు జరిగాయని సమాచారం. సుమారు ఇరవై మంది అధికారులు ఈ సంస్థకు చెందిన పలు వెంచర్లలో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. బంజారాహిల్స్ లోని ప్రధాన కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారని సమాచారం.

నగరానికి చెందిన పేరెన్నిక గల డెవలపర్ అయిన వాసవి గ్రూపు.. నగరంలోని వివిధ ప్రాంతాల్లో.. సుమారు ఇరవైకి పైగా ప్రాజెక్టుల్ని నిర్మిస్తోంది. నివాస, వాణిజ్య సముదాయాలతో పాటు లేఅవుట్లను సంస్థ డెవలప్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది.

This website uses cookies.