హైదరాబాద్ నగరానికి చెందిన ఫినీక్స్ సంస్థపై మంగళవారం ఐటీ సోదాలు జరిగాయి. కార్పొరేట్ ఆఫీసుతో పాటు ఈ సంస్థ డైరెక్టర్లపై ఐటీ అధికారులు సోదాల్ని నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఫినీక్స్ ఛైర్మన్, ఎండీ తదితర గ్రూపు సభ్యుల ఇళ్లల్లో సోదాలు జరుగుతున్నాయని సమాచారం. 2002లో ఆరంభమైనప్పట్నుంచి ఈ సంస్థ రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాలు, నిర్మాణ రంగం తదితర వ్యాపార కార్యకలాపాల్ని నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో స్పెషల్ ఎకనమిక్ జోన్లలో పలు ఐటీ సముదాయాల్ని అభివృద్ధి చేస్తోంది. రెసిడెన్షియల్ ప్రాజెక్టులు, షాపింగ్ మాళ్లను నిర్మిస్తోంది. ఫినీక్స్ సంస్థ ఛైర్మన్ సురేష్ చుక్కపల్లి హైదరాబాద్ కొరియా కాన్సుల్ జనరల్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ యాజమాన్యం ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వానికి చేరువగా ఉన్నందు వల్ల ఇలా ఐటీ దాడులు జరుగుతున్నాయని రియల్ రంగం భావిస్తోంది. ఎందుకంటే, మొన్న వాసవి, సుమధుర గ్రూపు తర్వాత ఫినీక్స్ సంస్థపై ఐటీ సోదాలు జరగడమే ఇందుకు నిదర్శనమని అనుకుంటోంది.
This website uses cookies.