Categories: LATEST UPDATES

కేబెల్‌ స్టార్స్‌ కోటి స్కాలర్‌షిప్‌ విజేతలు

  • హైదరాబాద్‌ నుంచి ఈ స్కాలర్‌షిప్‌ కోసం 85 మంది విజేతల ఎంపిక

వైర్‌ మరియు కేబుల్‌ తయారీదారు ఆర్‌ఆర్‌ కేబెల్‌ కేబెల్‌ స్టార్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ విజేతలను ప్రకటించింది. భారతదేశ వ్యాప్తంగా 1015 మంది విజేతలను ప్రకటిస్తే వారిలో 85 మంది హైదరాబాద్‌ నుంచి ఉన్నారు. ఈ విజేతలను హైదరాబాద్‌లోని ఆర్‌ ఆర్‌ కేబెల్‌ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలో సత్కరించారు. ఎలక్ట్రికల్‌ కమ్యూనిటీ కోసం అత్యంత కీలకమైన మార్కెట్‌ కావడంతో పాటుగా ఆర్‌ఆర్‌ కేబెల్‌కు సైతం కీలకమైన మార్కెట్‌గా హైదరాబాద్‌ వెలుగొందుతుంది. హైదరాబాద్‌ నుంచి ఎంపికైన 85 మంది విజేతలలో ఇద్దరు విద్యార్ధులు – శీలం షేశ్వంత్‌ మరియు సంజయ్‌ మంజా– 100% స్కోర్‌ చేయడంతో పాటుగా తమ రాష్ట్ర, జిల్లా టాపర్స్‌గా నిలిచారు. అంతేకాదు ముగ్గురు విద్యార్థులు – మొహమ్మద్‌ యూనిస్‌, ఫైజుద్దీన్‌ షేక్‌ మరియు మీనా వల్లంచెట్ల లు తమ 10వ తరగతి బోర్డు పరీక్షలలో 98%కు పైగా స్కోర్‌ సాధించారు.

ఈ కేబెల్‌ స్టార్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ ఎలక్ట్రీషిన్‌ల పిల్లలకు ప్రయోజనం కలిగించే రీతిలో పరిశ్రమలో ప్రారంభించిన మొట్టమొదటి కార్యక్రమం. ఈ సంవత్సరం తమ 10వ తరగతి పాస్‌ అయిన విద్యార్ధులకు ఈ స్కాలర్‌షిప్‌ అందిస్తారు. సాధికారిత , విద్యావంతమైన భారతావనిని నిర్మించాలనే బ్రాండ్‌ యొక్క లక్ష్యంలో ఇది భాగం. ఆర్‌ఆర్‌ కేబెల్‌ తమ హౌస్‌ వైర్‌ ప్రతి బాక్స్‌ విక్రయంపై ఓ రూపాయిని విరాళంగా అందిస్తుంది. ఈ మొత్తాలను ఒక కోటి రూపాయలకు పైగా ఎలక్ట్రీషియన్స్‌ చిన్నారుల హయ్యర్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ కోసం స్కాలర్‌షిప్‌ రూపంలో అందిస్తారు. భారతదేశవ్యాప్తంగా 1015 మంది విద్యార్థులను ఈ స్కాలర్‌షిప్‌ కోసం ఎంపిక చేశారు. వీరికి ఒక్కొక్కరికీ 10 వేల రూపాయల చొప్పున అందజేశారు.

తన మానస పుత్రిక మరియు లక్ష్యమైన ఈ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ గురించి ఆర్‌ఆర్‌ గ్లోబల్‌ డైరెక్టర్‌ కృతి కాబ్రా మాట్లాడుతూ ‘‘ఈ మైలురాయిని అందుకున్న కాబెల్‌ స్టార్స్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ విజేతలందరికీ నా అభినందనలు. వారు తమ లక్ష్యసాధన దిశగా మరో అడుగు ముందుకు వేశారని ఆశిస్తున్నాను. ఆర్‌ఆర్‌ కేబెల వద్ద మేము ఎలకా్ట్రనిక్స్‌ మా కమ్యూనిటీలో అంతర్భాగమని భావిస్తున్నాం. ఈ కార్యక్రమాలు ఈ కమ్యూనిటీ సంక్షేమానికి తగిన తోడ్పాటునందించడానికి కట్టుబడి ఉన్నాము. ఈ కేబెల్‌ స్టార్‌ స్టార్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ఎలక్ట్రీషియన్‌ కమ్యూనిటీకి వ్యాపారానికి ఆవల తోడ్పాటునందించడాన్ని లక్ష్యంగా చేసుకున్నాము.

ఈ కార్యక్రమానికి అపూర్వమైన స్పందన లభించడం పట్ల సంతోషంగా ఉన్నాం. ప్రతి చిన్నారి కెరీర్‌కి సంబంధించి నిర్ణయాత్మకంగా పదవ తరగతి పరీక్షలు ఉంటాయి. వారి భవిష్యత్‌కు పునాదిగా ఈ దశ నిలుస్తుంది. వారి ప్రయాణంలో అత్యంత కీలకంగా మేము వ్యవహరించాలనుకున్నాం. కొంతమంది విజేతలు 90%కు పైగా మార్కులను తమ పరీక్షలలో సాధించడం స్ఫూర్తిదాయకంగా ఉంది. ప్రతి కేబెల్‌ స్టార్‌ విజేత తమ విద్యను కొనసాగించడంతో పాటుగా తాము అభిమానించే కెరీర్‌ పొందగలరని ఆశిస్తున్నాను. ఈ తరహా కార్యక్రమాలతో నేటి యువత రేపటి నాయకులుగా మారేందుకు తగిన శక్తిని అందించడానికి ప్రయత్నిస్తున్నాం’’ అని అన్నారు.

This website uses cookies.