Categories: AREA PROFILE

ట్రిపుల్ ఆర్ రాక‌.. కేశంపేట్ రియాల్టీ కేక‌

  • గ‌జం రూ.4 వేల‌కు ప్లాట్లు దొరుకుతాయ్‌!
  • రియాల్టీలో గేమ్ చెంజర్ గా ట్రిపుల్ ఆర్
  • మారిపోనున్న ట్రిపుల్ ఆర్ కేశంపేట్ జంక్షన్

విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ నగరానికి రీజినల్ రింగ్ రోడ్డు మరో మణిహారంగా మార‌నున్న‌ది. మొత్తం 347 కిలోమీటర్ల పొడవున 4 వరుసలతో నిర్మించే ఈ గ్రీన్ ఎక్స్‌ప్రెస్ వేను రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. రెండు నుంచి మూడేళ్లలో రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తి చేయాలన్న‌ది ప్ర‌భుత్వాల ల‌క్ష్యం. ఈ క్రమంలో రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా కేశంపేట్ సమీపంలో నిర్మించే జంక్షన్ తో అక్కడ రియల్ ఎస్టేట్ రంగానికి మంచి ఫ్యూచర్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

శంషాబాద్-జడ్చర్ల రహదారిపై కేశంపేట్ దగ్గర నిర్మించే ఇంటర్ చేంజర్ చుట్టు పక్కల మౌలిక వసతులు ఏర్పాట‌య్యే అవ‌కాశ‌ముంది. ఇప్పటికే షాద్ నగర్ నుంచి జడ్చర్ల వరకు పారిశ్రామికంగా అభివృద్ది చెందగా.. ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్డు, కేశంపేట్ దగ్గర వచ్చే భారీ జంక్షన్ తో ఈ ప్రాంతం మరింత అభివృద్ది చెందుతుంద‌ని అంచనా వేస్తున్నారు. కేశంపేట్ సమీపంలో కాకునూర్ గ్రామంలో మార్కింగ్ చేయగా.. అందుకు సంబంధించిన‌ భూసేకరణ పనులు మొదలయ్యాయి. ట్రిపుల్ ఆర్ మార్కింగ్ తో కేశంపేట్ సమీప ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఫ‌ర్వాలేద‌నిపిస్తోంది. కేశంపేట్, బాలానగర్, జడ్చర్ల మధ్య మొన్నటి వరకూ.. ఎకరం ఎనభై లక్షల రూపాయలు ఉండగా.. ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్డు జంక్షన్ ఏర్పాటు అవుతుండ‌టంతో.. ఎకరం కోటి రూపాయలకు పెరిగిందని స‌మాచారం. ఈ రోడ్డు నుంచి 2 నుంచి 3 కిలోమీటర్ల రేడియస్లో ఎకరం 60 లక్షల నుంచి 80 లక్షలు చెబుతున్నారు.

* కేశంపేట్ కు సమీపంలోని తలకొండపల్లి, బాలానగర్, ఆమన్ గల్ వరకు రియల్ వెంచర్లు వెలిశాయి. కేశంపేట్ లో రియాల్టీ ప్రాజెక్టు, ప్రాంతాన్ని బట్టి చదరపు గజం 8 వేల నుంచి 15 వేల వరకు ధరలున్నాయి. పరిసర ప్రాంతాల్లో చదరపు గజం 5 వేల నుంచి 8 వేలు వరకు చెబుతున్నారు. తలకొండపల్లిలో చదరపు గజం 4 వేల నుంచి 14 వేల వరకు ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి.

This website uses cookies.