కరోనా తర్వాత లగ్జరీ ఫర్నీచర్ మార్కెట్ పుంజుకుంటోందని.. ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో హై ఎండ్ ఫ్లాట్లు కొన్నవారు.. విదేశీ ఫర్నీచర్‌ను కొనడంపై దృష్టి సారిస్తున్నారని ఖజానా గ్రూప్ సీఎండీ భవంత్ ఆనంద్ తెలిపారు. భారత లగ్జరీ ఫర్నీచర్ మార్కెట్ ప్రస్తుత పరిస్థితిపై ఆయన రియల్ ఎస్టేట్ గురుతో మాట్లాడుతూ.. కరోనా వల్ల ఈ విభాగంలో 20 శాతం అమ్మకాలు తగ్గిన మాట వాస్తవమేనని అంగీకరించారు. ఇంకా, ఏమన్నారో భవంత్ ఆనంద్ మాటల్లోనే..
”భారతదేశంలో ఐటీ, ఐటీఈఎస్, ఫార్మా వంటి రంగాలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. కరోనాలో కూడా వీరి ఉద్యోగాలకు పెద్దగా కోత పడలేదు. కాకపోతే, కరోనా సెకండ్ వేవ్ లో ఇంట్లో నుంచి బయటికి రాలేదు. లాక్ డౌన్ ఎత్తివేయగానే లగ్జరీ ఫ్లాట్లు, విల్లాల్ని కొన్నవారంతా ఇంటీరియర్స్ పనులు మొదలెట్టారు. ఫలితంగా, లగ్జరీ ఫర్నీచర్ కూడా కొనుగోలు చేయడం ఆరంభించారు. మన ఐటీ నిపుణులు విదేశాల్లో ఉద్యోగాలు చేయడం వల్ల విదేశీ ఫర్నీచర్ ట్రెండ్స్‌ను బాగా ఆకళింపు చేసుకున్నారు. అందుకే, బ్రాండెడ్ ఫర్నీచర్ కొనడంపై ఆసక్తి పెంచుకున్నారు. ఇక్కడికొచ్చాక ఇంపోర్టెడ్ ఫర్నీచర్ కొనడం మీద దృష్టి పెడుతున్నారు. ఈ అంశానికి గల ప్రాధాన్యతను అర్థం చేసుకుని 2001లో జూబ్లీహిల్స్‌లోని 36 రోడ్డులో 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫర్నీచర్ షోరూమును ఆరంభించాం. అక్కడితో ఆగకుండా.. 2006లో ఇంటీరియర్స్ నిమిత్తం ప్రత్యేక మాడ్యులార్ డివిజన్ ప్రారంభించాం.
2008లో జూబ్లీహిల్స్ చేరువలో 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విదేశీ ఫర్నీచర్ షోరూమును మొదలెట్టాం. 2011 నాటికి సొంతంగా ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. రెండేళ్లయ్యాక జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లో 30 ఏల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రీమియం గ్లోబల్ ఫర్నీచర్ షోరూమును ప్రారంభించాం. ఇలా ఎప్పటికప్పుడు ఫర్నీచర్ విభాగంలో కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ ముందుకెళ్లాం. అందుకే, అతి తక్కువ కాలంలోనే ఈ విభాగంలో లీడర్ స్థాయికి చేరుకున్నాం. ఇప్పటివరకూ పన్నెండు వేలకు పైగా ప్రాజెక్టుల్ని పూర్తి చేశాం. లక్షకు పైగా కొనుగోలుదారులకు మా సేవల్ని అందించాం. ఎప్పటికప్పుడు కొత్తదనం గురించి పరితపించడం వల్ల దాదాపు ముప్పయ్ మూడేళ్ల నుంచి ఈ రంగంలో అగ్రగాములుగా కొనసాగుతున్నాం.
ఫర్నీచర్ ఇంటీరియర్ ట్రెండ్స్‌ను ఎప్పటికప్పుడు హైదరాబాద్ వాసులకు అందించాలన్న లక్ష్యంతో.. ఇరవై దేశాలకు చెందిన ప్రముఖ బ్రాండ్లను మా షోరూము ద్వారా పరిచయం చేస్తున్నాం. బంజారాహిల్స్ రోడ్డు నెం. 12లో ఏడు అంతస్తుల నిర్మాణంలో.. ఒక్కో అంతస్తును ప్రత్యేక కాన్సెప్టుతో తీర్చిదిద్దాం. ప్రతి ఫ్లోరులో కనీసం 25 నుంచి 30 ఇంటి డిజైన్లు ఉంటాయి. వీటిని చూశాక, ప్రతిఒక్కరికీ తమ ఇంటిని ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది. ఇలా, మొత్తానికి మూడు వందల విభిన్నమైన లగ్జరీ గృహాలకు సంబంధించిన డిజైన్ కాన్సెప్టులను ప్రజల ముందుకు తెచ్చాం. లగ్జరీ ఫర్నీచర్ అంటే కేవలం ఎలివేట్ ఎక్స్‌లో మాత్రమే దొరుకుతుందనే రీతిలో లగ్జరీ బోటిక్ షోరూమును ఆరంభించాం.
ఇరవై దేశాలకు చెందిన లగ్జరీ ఫర్నీచర్ సంస్థలకు చెందిన సోఫాలు, డైనింగ్ టేబుళ్లు, పడక మంచాలు, మాడ్యులార్ కిచెన్లు, ఆర్టిక్రాఫ్ట్స్, రిక్లయినర్లు, రూమ్ డిజైన్లు వంటివి ప్రతిఒక్కర్ని ఆకర్షిస్తాయి. ఒక్కో వస్తువు డిజైన్, దాని తయారీ విధానం, అందుకు ఉపయోగించిన వస్తువులకు తగ్గట్టుగా తుది ధర ఆధారపడుతుంది. సోఫాలు, పడక మంచాలు రెండు లక్షల్నుంచి దొరుకుతాయి. ఫ్యాబ్రిక్ సోఫా రూ.2.5 లక్షలు, డైనింగ్ సెట్ రూ.3 లక్షలు, లెదర్ సోఫా రూ.4 లక్షల నుంచి లభిస్తాయి.”
This website uses cookies.