హైదరాబాద్.. అభివృద్ధి చెందుతున్న ఐటీ పరిశ్రమకు చిరునామా. దీంతో ఇళ్ల కొనుగోలుదారుల కోసం ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇలా అభివృద్ధి చెందుతున్న హాట్ స్పాట్ లలో కోకాపేట ఒకటి.
విలాసవంతమైన, ప్రశాంతమైన జీవనశైలిని కోరుకునేవారికి ఓ చక్కని గమ్యస్థానంగా నిలుస్తుంది. హైదరాబాద్ పశ్చిమ భాగంలో ఉన్న కోకాపేట.. దాని వ్యూహాత్మక స్థానం, అద్భుతమైన మౌలిక సదుపాయాలు, అమ్మకానికి సిద్ధంగా ఉన్న అధిక నాణ్యత కలిగిన 3 బీహెచ్ కే అపార్ట్ మెంట్ల లభ్యత కారణంగా ఈ ప్రాంతం ఎంతో ప్రజాదరణ పొందుతోంది. హైదరాబాద్ లో ఆదర్శవంతమైన రియల్ ఎస్టేట్ పెట్టుబడి అవకాశాల కోసం చూస్తుంటే.. మీకు కోకాపేట సరైన ఛాయిస్. వేగవంతమైన వృద్ధి కారణంగా తెలివైన పెట్టుబడిదారులకు కోకాపేట చక్కని గమ్యస్థానంగా మారింది. ఇందుకు కారణాలేమిటో చూద్దామా?
భౌగోళికంగా మంచి ప్లేస్ లో ఉంది. ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు, షాపింగ్ కేంద్రాలు, వైద్య సదుపాయాలు సమీపంలో ఉన్నాయి. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చాలా కొద్ది దూరంలోనే ఉంది.
విశాలమైన రోడ్లు, ఫ్లై ఓవర్లు, ఓఆర్ఆర్ తో చక్కని అనుసంధానం, ప్రణాళికాబద్ధమైన మౌలిక సదుపాయాలకు నిలయంగా ఉంది.
సమీపంలో అనేక ఐటీ హబ్ లు ఉండటం వల్ల టెక్ నిపుణులకు ఆకర్షణీయమైన ప్రదేశంగా మారింది.
నగర సందడి నుంచి తప్పించుకునే విధంగా ప్రశాంతమైన వాతావరణం కోకాపేటలో ఉంటుంది. పచ్చదనం, చుట్టూ కొండలు ఉన్నకారణంగా ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది.
ఇక్కడ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం గణణీయంగా పెట్టుబడులు పెడుతోంది.
విస్తృత శ్రేణిలో ఇళ్ల ఎంపికలు ఉన్నాయి. బడ్జెట్ అనుకూల అపార్ల్ మెంట్ల నుంచి విలాసవంతమైన విల్లాల వరకు ప్రతి ఒక్కరి జీవనశైలి, ప్రాధాన్యతలకు సరిపోయే ఇళ్లు లభ్యమవుతాయి.
అనేక షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లకు సులభమైన యాక్సెస్ ఉంది.
వీటికి తోడు అందమైన ఉద్యానవనాలు, వినోద ప్రదేశాలు, విశ్రాంతి కార్యకలాపాలకు అవసరమైన సౌకర్యాలు కూడా ఉన్నాయి.
ఇక్కడ స్తిరాస్థి డిమాండ్ పెరుగుతుండటం వల్ల రాబోయే కాలంలో ఆస్తి విలువలు గణణీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ పెట్టుబడి పెడితే దీర్ఘకాలికంగా పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.
కోకాపేట వేగంగా అభివృద్ధి చెందుతున్న కారణంగా వివిధ పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటవుతున్నాయి. తద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఇవన్నీ రియల్ రంగానికి ఊతమిస్తున్నాయి.
కోకాపేటకు హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాల నుంచి అద్భుతమైన కనెక్టివిటీ ఉంది.