Categories: LATEST UPDATES

కోకాపేట్ బ‌దులు కొల్లూరు ఎవ‌రికీ?

కోకాపేట్‌లో ఫ్లాట్ కొనాలంటే చ‌ద‌ర‌పు అడుక్కీ ప‌దివేల నుంచి ప‌దిహేను వేల దాకా అవుతుంది. మ‌రి, అంతంత స్థాయిలో సొమ్ము పెట్ట‌గ‌లిగే హోమ్ బ‌య్య‌ర్లు కొంత‌మంది ఉంటారు. మ‌రి, ఎక్కువ శాతం మంది త‌మ సొంతింటి క‌ల‌ను సాకారం చేసుకోవ‌డానికి అందుబాటులో ఉన్న ప్రాంతమేది అంటే.. క‌ళ్ల‌ముందు క‌న్పించే క‌నువిందైన ఆప్ష‌న్‌.. కొల్లూరు. ఔనండి.. మేం చెప్పేది వాస్త‌వ‌మే.

ఓఆర్ఆర్ లేదా స‌ర్వీస్ రోడ్డు మీదుగా ప‌దిహేను నుంచి ఇర‌వై నిమిషాలు మీరు ప్ర‌యాణం చేయ‌గ‌లిగితే చాలు.. ఎంచ‌క్కా కొల్లూరు స‌ర్వీస్ రోడ్డు ప‌క్క‌నే మీరు స్థిర నివాసాన్న ఏర్పాటు చేసుకోవ‌చ్చు. కోకాపేట్‌తో పోల్చితే కేవ‌లం సగం ధ‌ర‌కే మీరు ఎంచ‌క్కా ఒక బ్యూటీఫుల్ ప్రాజెక్టులో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవ‌చ్చు. మ‌రి, కొల్లూరులో అన్నిర‌కాలుగా న‌ప్పే ఆక‌ర్ష‌ణీయ‌మైన ప్రాజెక్టే.. అన్వితా ఇవానా.

కొల్లూరు ప్ర‌త్యేక‌త‌లివే..

ర‌ణ‌గొణ‌ధ్వ‌నుల‌కు దూరంగా ప్ర‌శాంత‌మైన జీవ‌నాన్ని కొన‌సాగించాల‌ని కోరుకునేవారు ఎంచ‌క్కా కొల్లూరుకు రావాల్సిందే. ఇక్క‌డ పుష్క‌ల‌మైన భూగ‌ర్భ‌జ‌లాలున్నాయి. కొల్లూరు దాకా మంచినీటి పైపు లైన్‌ను వాట‌ర్ బోర్డు డెవ‌ల‌ప్ చేసింది. ఇక్క‌డే అంత‌ర్జాతీయ స్కూళ్లు కొలువుదీరాయి. ఇక్క‌డ్నుంచి న‌గ‌రంలోని ఏ ప్రాంతానికైనా ఓఆర్ఆర్ మీద సులువుగా రాక‌పోక‌ల్ని సాగించొచ్చు. గ‌చ్చిబౌలి, ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్టులో ప‌ని చేసే నిపుణులు ఇర‌వై నిమిషాల్లో ఆఫీసుల‌కు చేరుకోవ‌చ్చు. కోకాపేట్‌తో పోల్చితే ఇక్క‌డ ఫ్లాట్ల ధ‌ర‌లు త‌క్కువ ఉండ‌టం వ‌ల్ల భ‌విష్య‌త్తులో మంచి అప్రిసియేష‌న్‌కు స్కోప్ ఉంది. ఇలాంటి సానుకూలాంశాల్ని గ‌మ‌నించిన అన్వితా గ్రూప్‌.. ఇవానా ప్రాజెక్టును చూడ‌చ‌క్క‌గా ముస్తాబు చేసింది. నిర్మాణ ప‌నుల్ని జోరుగా జ‌రిపిస్తోంది.

This website uses cookies.