KTR IS CHIEF GUEST FOR CREDAI PROPERTY SHOW 2022
క్రెడాయ్ హైదరాబాద్ 11వ ఎడిషన్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవడానికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. శుక్రవారం ఉదయం పది గంటలకు హైటెక్స్‌లో ఆరంభమయ్యే ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ, క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు పి.రామకృష్ణారావు, కార్యదర్శి వి.రాజశేఖర్ రెడ్డి తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఏప్రిల్ 29 నుంచి మే 1 వరకూ జరిగే ఈ కార్యక్రమంలో క్రెడాయ్ డెవలపర్లు, మెటీరియల్ వెండార్లు, బిల్డింగ్ మెటీరియల్ మాన్యుఫాక్చరర్స్, కన్సల్టెంట్స్ మరియు ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ వంటి వారు ఒకే వేదిక మీద తమ ఆవిష్కరణలను ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రతిఒక్కరి బడ్జెట్ కు తగ్గట్టుగా ప్రాపర్టీలను ప్రదర్శిస్తారు. తద్వారా వినియోగదారులకు జంట నగరాల్లో అత్యుత్తమ గృహ పరిష్కారాలను పొందే అవకాశం కల్పిస్తారు.
ఈ ప్రదర్శనలో కేవలం టీఎస్–రెరా అనుమతి పొందిన ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లు, అపార్ట్‌మెంట్ కాంప్లెక్ప్‌లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, గ్రీన్ బిల్డింగ్స్ వంటివి రిటైల్ మరియు వాణిజ్య కాంప్లెక్స్, ఓపెన్ ప్లాట్స్ మొదలైన వాటి వివరాలు లభిస్తాయి. నగరం నలువైపులా నిర్మితమయ్యే ప్రాజెక్టుల వివరాలు లభిస్తాయి కాబట్టి.. ఈ ప్రాపర్టీ షోకు విచ్చేస్తే చాలు.. సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు.
This website uses cookies.