గూగుల్ సంస్థ హైదరాబాద్‌లో తమ కార్యాలయ నిర్మాణ పనుల్ని ఆరంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ విచ్చేశారు. సుమారు 3.3 మిలియన్ చదరపు అడుగుల ఈ కార్యాలయ నిర్మాణ పనులు ఆయన చేతుల మీదుగా ఆరంభమయ్యాయి.
అమెరికాలోని గూగుల్ హెడ్ క్వార్టర్స్ తర్వాతి అతి పెద్ద కార్యాలయం ఇదే కావడం గమనార్హం. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గూగుల్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. ఎనర్జీ ఎఫీషియెంట్ భవనంగా దీన్ని నిర్మిస్తారని సమాచారం.
This website uses cookies.