హైదరాబాద్‌లోని ఏ లొకేషన్‌లో అయినా.. శ్రీ శ్రీనివాసా ఇన్‌ఫ్రా నుంచి కొత్త ప్రాజెక్టు వచ్చిందంటే చాలు.. అక్కడి చుట్టుపక్కల ప్రజలకు సంతోషపడతారు. మాదాపూర్ మెయిన్ రోడ్డు మీద ఫార్చ్యూన్ టవర్స్ గేటెడ్ కమ్యూనిటీ సైబర్ సిటీలోనే ఒక ట్రెండ్ సెట్టింగ్ ప్రాజెక్టు అని చెప్పాలి. పాత ముంబై హైవే మీద.. మదీనాగూడలో ఫార్చ్యూన్ హైట్స్ అఫర్డబుల్ లగ్జరీకి మారుపేరుగా నిలిచింది. సోమాజిగూడలో జీవీకే స్కై సిటీ అయినా బంజారాహిల్స్‌లో ఫార్చ్యూన్ వన్ అయినా.. కోకాపేట్‌లో సొంతాలియా స్కై విల్లాస్.. కొండాపూర్‌లో సైప్రస్ పామ్స్.. ఇలా, ఈ సంస్థ ఎక్కడ ప్రాజెక్టు చేపట్టినా.. ఆయా ప్రాంతానికే ల్యాండ్‌మార్క్‌గా నిలిచిపోతుంది. తాజాగా, శ్రీ శ్రీనివాసా ఇన్‌ఫ్రా సంస్థ కూకట్‌పల్లిలో ఆరంభించిన కొత్త ప్రాజెక్టు గురించి చెబితే మీరంతా ఆశ్చర్యపోతారు. హైదరాబాద్‌లోనే ప్రప్రథమంగా లేక్‌వ్యూ ప్రీమియం ప్రాజెక్టుగా.. ఫార్చ్యూన్ వాటర్‌ఫ్రంట్ అనే బ్యూటీఫుల్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీని కొత్తగా డెవలప్ చేస్తోంది. దీనికి స్థానిక సంస్థలతో పాటు టీజీ రెరా అనుమతి కూడా లభించింది.
హైదరాబాద్ లోని అత్యంత పాపులర్ ప్రదేశాల్లో ఒకటైన కూకట్ పల్లిలో అదిరిపోయే ఐడీఎల్ లేక్ వ్యూతో ఫార్చ్యూన్ వాటర్ ఫ్రంట్ ప్రాజెక్టు అద్భుతంగా రూపుదిద్దుకుంటోంది. 3.04 ఎకరాల విస్తీర్ణంలో 22 అంతస్తులతో రెండు టవర్లు నిర్మితమవుతున్నాయి. మూడు సెల్లార్లు ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రతి అంతస్తులో 6 యూనిట్ల చొప్పున మొత్తం 262 యూనిట్లను నిర్మిస్తున్నారు. రెండు టవర్లకు మధ్య 17 మీటర్ల దూరం ఉండగా.. నగరంలోనే ప్రప్రథమంగా 31 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్టా కవర్డ్ ల్యాండ్ స్కేప్ సౌకర్యాలు కల్పిస్తున్నారు. 1875 చదరపు అడుగుల నుంచి 2880 చదరపు అడుగుల మధ్యలో వివిధ పరిమాణాల్లో అన్న 3 బీహెచ్ కే యూనిట్లే ఉండనున్నాయి. ఫస్ట్ ఫ్లోర్ ఎత్తు 20 మీటర్లు ఉండగా.. అక్కడ నుంచి అంతస్తుకు అంతస్తుకు మధ్య 3.15 మీటర్ల ఎత్తు ఉంటుంది. ప్రతి ఫ్లాట్ కు ప్రైవేటు లాబీలు, నాలుగు వైపుల నుంచి గాలి, వెలుతురు వచ్చేలా డిజైన్, లేక్ వ్యూ, 73.5 శాతం ఓపెన్ స్పేస్ అనేవి ఈ ప్రాజెక్టు ప్రధాన అంశాలు. అంతస్తుకు 6 ఫ్లాట్లు మాత్రమే ఉండటం వల్ల తక్కువ జనసాంద్రతతో ఎక్కువ స్పేసియస్ గా ఉంటుంది.
అల్ట్రా మోడర్న్ సౌకర్యాలతో గ్రౌండ్ ప్లస్ 4 అంతస్తుల్లో.. 22,617 చదరపు అడుగుల క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టుకే మరో ఆకర్షణగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వాస్తవానికి, ఇంత ఆధునికమైన క్లబ్ హౌజ్ ఇక్కడి చుట్టుపక్కల ప్రాజెక్టుల్లోనే లేదని చెప్పాలి.
అన్నీ చేరువలోనే..
73.5 శాతం ఓపెన్ స్పేస్ ఉండటం వల్ల.. ఆ మేరకు పచ్చదనంతో మమేకమయ్యేలా ల్యాండ్ స్కేపింగ్ డిజైన్ తీర్చిదిద్దారు. కూకట్ పల్లిలోని ఐడీఎల్ చెరువు సమీపంలోనే ఈ ప్రాజెక్టు ఉండటం వల్ల స్కూళ్లు, కాలేజీలు, ఆస్పత్రులు, ఇతరత్రా షాపింగ్ మాల్స్ అన్నీ దగ్గరలోనే ఉంటాయి. అలాగే రవాణా సౌకర్యాలకు కూడా ఎలాంటి ఇబ్బందీ ఉండదు. చేరువలోనే మెట్రరైల్వే స్టేషన్ కూడా ఉంది. ఇక్కడ్నుంచి అటు హైటైక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాలకు సులువుగా రాకపోకల్ని సాగించొచ్చు. అదేవిధంగా, అమీర్‌పేట్, సచివాలయం, ఎంజీబీఎస్, జేబీఎస్ వంటి బస్టాండులకు ఇట్టే వెళ్లిపోవచ్చు.
This website uses cookies.