Categories: TOP STORIES

కోకాపేటలో మళ్లీ భూముల వేలం?

64 ఎకరాలకు వారంలో నోటిఫికేషన్

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ సంస్థ (హెచ్ఎండీఏ) మరోసారి భూముల వేలానికి సిద్ధమవుతోంది. కోకాపేట నియోపోలిస్ లేఔట్ లో 64 ఎకరాలను ఆన్ లైన్ లో వేలం వేయనుంది. దీనికి సంబంధించి వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. వేలం ప్రక్రియను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్ టీసీకి అప్పగించారు. కాగా, కోకాపేట నియోపోలిస్ లేఔట్ లో మొదటి దశ వేలం 2021 జూలైలో జరిగింది. అప్పుడు 49 ఎకరాల్లో 8 ప్లాట్లను వేలంలో ఉంచగా.. 60 మంది పోటీ పడ్డారు. ఎకరా ధర రూ.25 కోట్లు నిర్ణయించగా.. వేలంలో ఎకరం ధర సగటున రూ.40.05 కోట్లు పలికింది. గరిష్టంగా ఎకరం ధర రూ.60 కోట్లు వచ్చింది. తద్వారా సర్కారుకు రూ.2వేల కోట్ల ఆదాయం వచ్చింది. ఈ నేపథ్యంలో 64 ఎకరాల లేఔట్ లో అభివృద్ధి పనులు పూర్తిచేసి రెండో దశ వేలానికి హెచ్ఎండీఏ సిద్ధమైంది. ఒక్కో ప్లాటు 5 నుంచి 8 ఎకరాల్లో మొత్తం 6 నుంచి 10 ప్లాట్లు ఉన్నాయి.

This website uses cookies.