Categories: PROJECT ANALYSIS

ముప్ప‌య్ ఆరు ఎక‌రాల్లో.. ముప్పాస్ ఇంద్ర‌ప్ర‌స్థ..

వోరం న‌ట‌రాజ్ సుంద‌ర్‌,
సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌,
7674008199

  • స్వ‌ర్గం, భూమి క‌లిసే చోట‌
  • ప్ర‌కృతిలో నివసించేవారికే!
  • భ‌విష్య‌త్తు త‌రాల‌కు స్వ‌చ్ఛ‌మైన క‌మ్యూనిటీ
  • ప్ర‌తిరోజూ అతిమ‌ధుర‌మే ఇక్క‌డ‌
  • అన్ని వ‌ర్గాల వారికీ న‌ప్పే నిర్మాణం

అల‌నాడు అమరావతిలో ఇంద్రుడు నిర్మించుకున్న సుమనోహర సౌదం రీతిలో.. మ‌హాభార‌తంలో ఇంద్రుడే ఈర్ష్య ప‌డే విధంగా మ‌హా నిర్మాణ‌శిల్పి విశ్వ‌క‌ర్మ ఓ విశాల‌మైన భ‌వ‌నాన్ని నిర్మించిన త‌ర‌హాలో.. ప‌శ్చిమ హైద‌రాబాద్‌లోని ఐటీ కారిడార్‌కు అత్యంత చేరువ‌లో.. ఒక సుమ‌నోహ‌ర‌మైన ట్రిప్లెక్స్ విల్లా క‌మ్యూనిటీ సిద్ధ‌మైంది. ఇందులో అలా విల్లా కొన‌గానే ఇలా ఇంటీరియ‌ర్స్ చేయించుకుని ఎంచ‌క్కా సొంతింటి ఆనందాన్ని ఆస్వాదించొచ్చు.

హైదరాబాద్లో మూడు ద‌శాబ్దాలుగా ప‌లు ప్రతిష్ఠాత్మకమైన అపార్టుమెంట్లు, విల్లా క‌మ్యూనిటీల‌ను నిర్మించి.. వేలాది మంది సొంతింటి క‌ల‌ను సాకారం చేసిన ముప్పా ప్రాజెక్ట్స్..

దేశానికే తలమానికమైన ప‌శ్చిమ హైదరాబాద్లోని ఐటీ ప్రపంచానికి కూతవేటు దూరంలో.. పచ్చని పర్యావరణంలో.. ఆహ్లాదకర వాతావరణంలో.. ఉస్మాన్ న‌గ‌ర్‌లో ముప్పాస్ ఇంద్ర‌ప్ర‌స్థ విల్లా క‌మ్యూనిటీని అభివృద్ధి చేస్తోంది. గృహ‌ప్ర‌వేశానికి సిద్ధంగా ఉన్న ఈ బ‌డా విల్లా ప్రాజెక్టు గురించి ఎంత చెప్పినా త‌క్కువే అనొచ్చు. దాదాపు 36 ఎక‌రాల్లో ఈ ప్రీమియం క‌మ్యూనిటీని నిర్మించింది. విల్లాల విస్తీర్ణం విష‌యానికి వ‌స్తే.. 400, 300, 235 గ‌జాల్లో 4550, 4050, 3400 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఆక‌ర్ష‌ణీయంగా తీర్చిదిద్దారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. జీవితంలో అందమైన సంతృప్తికర నివాస గృహంలో జీవించాలనుకుంటే ముప్పా ఇంద్రప్రస్థ‌ ప్రీమియం విల్లాస్ లోనే జీవించాలన్న చందంగా తీర్చిదిద్దారు. ఈ మొత్తం విల్లా క‌మ్యూనిటీని చూడ‌టానికి రెండు క‌ళ్లు స‌రిపోవంటే న‌మ్మండి.

ఆధునిక స‌దుపాయాల‌కు పెద్ద‌పీట‌

ముప్పాస్ ఇంద్రప్రస్థ‌లో నివాసం ఉండే వారి జీవన ప్రమాణాలు, ఆటవిడుపు, విందు వినోదాలు, శుభాకార్యాలు, పార్టీలు, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్, ఈవెంట్స్ వంటి వాటికి ప్రాముఖ్యతనిస్తూ..

ఎక్కడా రాజీప‌డ‌కుండా అన్ని వసతుల్ని కల్పించింది. కమ్యూనిటీ లివింగ్ క్రీడాభిమానులకు.. ఇండోర్ బాడ్మింటన్, బిలియ‌ర్డ్స్ పూల్ టేబుల్, ఇండోర్ గోల్ఫ్‌ పుట్టింగ్, టేబుల్ టెన్నిస్ వంటి ఇండోర్ గేమ్స్.. ఆధునిక కంప్యూటర్ గేమింగ్ విభాగాలను “ఇంద్ర క్లబ్” హౌస్ లో ఏర్పాటు చేశారు. పిల్లలకు ప్రత్యేకంగా క్యార‌మ్ బోర్డు, చెస్, కంప్యూటర్ గేమింగ్ వంటి వాటికి స్థానం క‌ల్పించారు. ఇంకా వారి మనసుకు నచ్చే విధంగా చిల్డ్రన్ ఇండోర్ ప్లే ఏరియాల‌ను ప్రత్యేకంగా రూపొందించారు.

ఇంద్రప్రస్థ‌ రెసిడెంట్స్ ఫిట్‌నెస్తో ఉండేందుకు ఏరోబిక్స్‌, సిక్స్ ప్యాక్ కావాల‌ని వారికోసం ప్ర‌త్యేక కోచ్‌లు ఏసీ జిమ్‌లో అందుబాటులో ఉంటారు. బ‌య‌టి ప్ర‌కృతి అందాల్ని ఆస్వాదిస్తూ జిమ్‌లో వ‌ర్క‌వుట్స్ చేయ‌వ‌చ్చు. ఇందులో అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో రూపొందించిన స్విమ్మింగ్ పూల్ ప్ర‌తిఒక్క‌ర్ని ఇట్టే ఆక‌ట్టుకుంటుంది. పూల్ చుట్టూ గ్రీన‌రీని ఎంతో సొగ‌సుగా తీర్చిదిద్దారు. డెక్ ఏరియా, బ్లూలాగూన్ కాఫీ, జ్యూస్ సెంటర్లు వంటివి ప్ర‌తిఒక్క‌ర్ని ఆక‌ట్టుకుంటాయి. చిన్న చిన్న పార్టీల‌కు ప్ర‌త్యేకంగా పార్టీ ఏరియాను తీర్చిదిద్దారు.
ఉద్యోగ‌, వ్యాపారాల్లో నిత్యం బిజీగా ఉండేవారికి ఈ క్ల‌బ్ హౌజ్ వీకెండ్ హ‌బ్‌గా ప‌నికొస్తుంద‌ని చెప్పొచ్చు. అంద‌రి ఎంట‌ర్‌టైన్‌మెంట్ కోసం క్లాసిక్ మ‌రియు లేటెస్ట్ సినిమాల‌ను వీక్షించేందుకు మినీ థియేట‌ర్‌ను ఏర్పాటు చేశారు. యోగా, మెడిటేష‌న్ వంటి వాటికోసం ప్ర‌త్యేకంగా హాళ్ల‌ను కేటాయించారు. మినీ హాల్‌, మీటింగ్ హాల్ వంటివి విశాలంగా ఉన్నాయి. బిజినెస్‌, ఉద్యోగాల‌తో నిత్యం త‌ల‌మున‌క‌ల‌య్యే పిల్ల‌ల కోసం ప్ర‌త్యేకంగా క్రెష్ ఏర్పాటు చేశారు. అంద‌మైన పార్కులు.. విశాల‌మైన ర‌హ‌దారులు.. ఎంట్రెన్స్ ఆర్చ్‌తో ముప్పా ఇంద్ర‌ప్ర‌స్థ విల్లాలు ప్ర‌తిఒక్క‌ర్ని అమితంగా ఆక‌ర్షిస్తాయి. భ‌ద్ర‌త కోసం పెద్ద‌పీట వేశారీ ప్రాజెక్టులో. 24 గంట‌లు సెక్యూరిటీ అందుబాటులో ఉంటుంది. కాబ‌ట్టి, ప్రశాంతంగా జీవ‌నాన్ని కొన‌సాగించొచ్చు.

This website uses cookies.