Categories: TOP STORIES

వేడిని తరిమికొడదాం రండి

  • నగరాల్లో ఏటా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
  • వీటిని ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన వ్యూహాలు అవసరం
  • సంప్రదాయ పద్ధతులకు సమకాలీన వ్యూహాలు జోడిస్తే అద్భుత ఫలితాలు
  • వేడిని ఎదుర్కోవడంలో సాంకేతికతదీ కీలక పాత్రే
  • పల్లెల కంటే పట్టణాలు వేడిగా ఉంటాయనేది అందరికీ తెలిసిన విషయమే. నిర్మాణ సామగ్రి నుంచి రవాణా ఇంధనాల వరకు పట్టణానికి సంబంధించిన అనేక అంశాలు నగరాల్లో వేడికి ప్రధాన కారకాలుగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరాల్లో అనేక డిగ్రీల ఉష్ణోగ్రతలు పెంచుతాయి. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వేడిగాలులతో కూడిన వేసవి ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో చాలా చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటేశాయి. ఈ నేపథ్యంలో నగరాలను వేడి నుంచి రక్షించేందుకు సమర్థవంతమైన వ్యూహాలు అత్యవసరం. స్థిరైన పట్టణ ప్రణాళిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజల భాగస్వామ్యం వంటి బహుముఖ విధానాలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మన నగరాలను చల్లబరచడం, మానవాళి శ్రేయస్సే లక్ష్యంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

    ప్రస్తుతం మన దేశంలోని చాలా మెట్రోపాలిటన్ నగరాలు వేసవి వేడితో కాలిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా హీట్ వేవ్స్ ఉండటంతో ఈ వేడిని తట్టుకునేలా వినియోగదారు కేంద్రీకృత డిజైన్లన రూపొందించాల్సిన ఆవశ్యకత బాగా పెరిగింది. హరిత సదుపాయాలు, బిల్డింగ్ రెగ్యులేషన్స్, నీటి నిర్వహణ, ప్రజా రవాణా వ్యవస్థ, స్థిరమైన డిజైన్ పద్ధతులు వంటి ఆధునిక వ్యూహాలు మన నగరాలను సౌకర్యం, శ్రేయస్సు యొక్క ఒయాసిస్‌లుగా మార్చడంలో కీలకమైనవి. ఈ నేపథ్యంలో సంప్రదాయ పద్దతులకు సమకాలీన వ్యూహాలను జోడించడం ద్వారా సౌలభ్యం, సంతృప్తినిచ్చే చల్లని వాతావరణాలను రూపొందించే అవకాశం ఉంది.

    వెర్టికల్ గార్డెన్స్..

    పట్టణాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలను ఎదుర్కొని, చల్లని వాతావరణాన్ని సృష్టించడం, కమ్యూనిటీలను ప్రోత్సహించడంలో హరిత సదుపాయాలు శక్తివంతమైన సాధనంగా ఉద్భవించాయి. వీధుల్లో చెట్లు నాటడం, పట్టణ ప్రణాళికలో ఆకుపచ్చ-నీలం కారిడార్లను ఏకీకృతం చేయడం ఇందులో ముఖ్యమైనవి. ఇవి పట్టణ వేడిన తగ్గించడంతోపాటు ప్రకృతితో సమాజం మరింత మమేకం కావడానికి దోహదరపడతాయి. సమర్థవంతమైన వాతావరణ వ్యూహాలను అమలు చేయడానికి పట్టణ పథకాలకు బడ్జెట్‌లను కేటాయించడం, స్థానిక పాలనలో సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించడం చాలా అవసరం. ఇందుకు సింగపూర్ లోని గార్డెన్స్ బై ది బే ఉదాహరణ. పరిసర ప్రాంతాన్ని చల్లబరచడానికి స్థిరమైన సాంకేతికతతో అనుసంధానం చేసిన విస్తారమైన పచ్చని ప్రదేశంగా దీనిని చెప్పొచ్చు. ది గార్డెన్స్ బై ది బే సూపర్‌ ట్రీలను కలిగి ఉంది. నీడను అందించడమే కాకుండా సౌర శక్తిని వినియోగించే, వర్షపు నీటిని సేకరించే వెర్టికల్ గార్డెన్స్ ఇవి.

    భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడం..

    చెరువులు, కుంటలు, సరస్సుల వంటివి సహజమైన ఉష్ణ సింక్ లుగా పని చేస్తాయి. భూగర్భ జలాల పునరుద్ధరణకు గణనీయంగా తోడ్పడతాయి. మనదేశంలో పురాతన మెట్ల బావుల వంటివి వేసవి ఉపశమనం కోసం కలకాలం పరిష్కారాన్ని అందిస్తాయి. ఈ నిర్మాణ అద్భుతాలు భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడమే కాకుండా వేసవి కాలంలో సహజమైన చల్లదనాన్ని అందిస్తాయి. భారతీయ వారసత్వంలో లోతుగా పాతుకుపోయిన స్థిరమైన విధానాన్ని ప్రదర్శిస్తాయి. వర్షపు నీటి సంరక్షణ, కృత్రిమ చెరువులను ఏర్పాటు చేయడం, ఇప్పటికే ఉన్న నీటి వనరుల పునరుజ్జీవనం ద్వారా పరిసర ప్రాంతాలను చల్లగా రూపొందించడానికి వీలువుతుంది. ఢిల్లీలోని రాజోక్రి వాటర్ బాడీని పునరుద్ధరించడం సమర్థవంతమైన నీటి నిర్వహణకు ఓ గొప్ప ఉదాహరణ. శాస్త్రీయ చిత్తడి నేల వ్యవస్థ ద్వారా ఈ సరస్సును పునరుద్ధరించారు. దీనివల్ల నీటి నాణ్యత కూడా మెరుగుపడింది. భూగర్భ జలాల రీచార్జ్ ను ప్రోత్సహించడంతోపాటు వరదల నివారణకు బఫర్ గా పనిచేస్తుంది.

    ప్రజారవాణా వ్యవస్థలో మార్పులు..

    నగరాల్లో వేడిని తగ్గించడానికి ప్రజా రవాణా నెట్ వర్క్ ను అభివృద్ధి చేయడం మరో కీలకమైన అంశం. సమర్థవంతమైన పట్టణ ప్రణాళిక ద్వారా రోడ్డుపై ప్రైవేటు వాహనాల సంఖ్యను తగ్గించొచ్చు. ఇది ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది. ఫలితంగా వాహన ఉష్ణ ఉద్గారాలు తగ్గుతాయి. గాలి నాణ్యత మెరుగవుతుంది. వీటన్నింటి కారణంగా పట్టణ ఉష్ణోగ్రతలు గణణీయంగా తగ్గుతాయి. బ్రెజిల్‌లోని కురిటిబాలో బస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ను స్ఫూర్తిగా తీసుకోవచ్చు. ఇది ప్రైవేట్ వాహనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. దీంతో నగరంలో వేడి కూడా తగ్గింది.

    ప్రజా సౌకర్యాలు

    సంప్రదాయ భారతీయ పట్టణాలలో అత్యంత ప్రసిద్ధ మరియు ఆలోచనాత్మకమైన డిజైన్ అంశాలలో ‘ప్యౌ’ లేదా తాగునీటి వినియోగం ఒకటి. రద్దీగా ఉండే వీధులు, మతపరమైన ప్రదేశాలు, పబ్లిక్ భవనాలలో ఉన్న ఈ నిరాడంబరమైన నిర్మాణాలు దాహాన్ని తీర్చడమే కాకుండా వేడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అయినప్పటికీ, సమకాలీన పట్టణ ప్రకృతి దృశ్యాలలో వాటి ఉనికి తగ్గిపోయింది. అలాంటి సౌకర్యాలను పునరుద్ధరించడం అనేది ఇప్పుడు అత్యంత అవసరంగా మారింది. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా పెద్ద పబ్లిక్ భవనాల సరిహద్దుల వెంబడి టాయిలెట్ల నిర్మాణం, ఈ భావనను మరింత విస్తరించే అవకాశం కల్పిస్తుంది. అలాగే పర్యావరణ స్పృహతో కూడిన నిర్మాణ నిబంధనల వైపు నడవడం ప్రస్తుత పరిస్తితుల్లో చాలా ముఖ్యం. వేడిని తట్టుకునే పదార్థాలు, సహజ వెంటిలేషన్ మరియు షేడింగ్ టెక్నిక్‌లకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా భవనాల్లో వేడిని గణనీయంగా తగ్గించవచ్చు.

    ఆటోమేటెడ్ షేడింగ్ సిస్టమ్స్

    ప్రతి ఒక్కరూ ఉష్ణ స్థితిస్థాపకత వైపు వేసే అడుగులు క్రమంగా పెద్ద స్థాయి కార్యక్రమాలను సాధించడంలో సహాయపడతాయి. సంప్రదాయ భారతీయ వాస్తు శిల్పంలోని చజ్జాలు, జాలీల వంటివి సహజమైన వెలుతురు, నీడలను అందిస్తాయి. ఫలితంగా భవనాల్లో వేడి తగ్గుతుంది. బాల్కనీలు, టెర్రస్ లను కలపడం వల్ల ఇంటీరియర్, ఔట్ డోర్ మధ్య పరివర్తన సులభమవుతుంది. అదే సమయంలో ఇంటీరియర్‌లు నేరుగా వేడికి గురికాకుండా ఉంటాయి. ఆధునిక భవనాల్లో ఉష్ణ స్థితిస్థాపకతను మెరుగుపరచడానికి చాలా మార్గాలున్నాయి. సన్-ట్రాకింగ్ ప్యానెల్‌లు లేదా ఆటోమేటెడ్ షేడింగ్ సిస్టమ్‌ వంటి డైనమిక్ ఎలిమెంట్స్, నిజ సమయంలో పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకుంటాయి. ఈ వ్యవస్థలు సూర్యకాంతి తీవ్రత, గాలి దిశ, బహిరంగ ఉష్ణోగ్రత వంటి అంశాల ఆధారంగా లౌవ్‌లు, షేడ్స్ లేదా ప్యానెల్‌ల కోణం లేదా స్థానాన్ని సర్దుబాటు చేస్తాయి. గుడారాలు, పందిరి, రెక్కల వంటి షేడింగ్ పరికరాలు ఈ కొత్త వ్యవస్థలో మరో అంతర్భాగం. ఈ పరికరాలను భవన ఉపరితలాలు, కిటికీలు, బహిరంగ ప్రదేశాల్లో నీడ ఇచ్చేందుకు రూపొందించారు.

    ఆకుపచ్చ పైకప్పులు..

    వేడి నివారించేందుకు మరో అద్భుతమైన మార్గం.. గ్రీన్ రూఫ్ ల ఏర్పాటు. ఈ ఆకుపచ్చని పైకప్పులు వేడి నుంచి రక్షిస్తాయి. లోపలి ఉష్ణోగ్రతలను గణనీయంగా తగ్గిస్తాయి. ఇవే కాకుండా ప్రతి ఒక్కరూ తమ ఇంటి సరిహద్దుల్లో చిన్న చిన్న నీటి వనరులు లేదా తాగునీటి సౌకర్యాలను ఏర్పాటు చేయడం ద్వారా చక్కని వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.

This website uses cookies.