Categories: TOP STORIES

మే 17 నుంచి 19 దాకా.. ఐజీబీసీ గ్రీన్ ప్రాప‌ర్టీ షో..

ఐజీబీసీ గ్రీన్ ప్రాప‌ర్టీ షో రెండో ఎడిష‌న్ ఈ నెల 17 నుంచి 19 వ‌ర‌కూ హైద‌రాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిష‌న్ సెంట‌ర్‌లో జ‌రుగుతుంద‌ని నిర్వాహ‌కులు తెలిపారు. గురువారం బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణాలో నిర్వ‌హించిన విలేకరుల స‌మావేశంలో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఐజీబీసీ నేషనల్ వైస్ చైర్మన్ సి శేఖర్ రెడ్డి, ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ కో-ఛైర్మన్ జి. శ్రీనివాస్ మూర్తి, ఐజీబీసీ డిప్యూటీ ఎగ్జి క్యూటివ్ డైరెక్టర్ ఎం ఆనంద్, ఐజీబీసీ సీనియర్ కౌన్సెలర్ సందీప్ వుల్లికంటి తదితరులు పాల్గొన్నారు.

This website uses cookies.