poulomi avante poulomi avante

నివాసితుల‌కు ఎలాంటి ఇబ్బందులు రానివ్వం

  • మై హోమ్ అవ‌తార్ అధ్య‌క్షుడు ర‌వీంద్ర చారి

తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ అయిన మై హోమ్ అవతార్లో నివసించేవారికి ఎలాంటి ఇబ్బందులు రానీయకుండా తగిన జాగ్రత్తల్ని తీసుకుంటామని రవీంద్ర చారి తెలిపారు. ఇటీవల మై హోమ్ అవతార్లో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయ‌న రియ‌ల్ ఎస్టేట్ గురుతో ప్ర‌త్యేకంగా మాట్లాడారు. క‌మ్యూనిటీలో ఉండే ఫెసిలిటీస్‌ను మెరుగ్గా నిర్వ‌హించ‌డ‌మే త‌మ ముందున్న ప్ర‌థమ క‌ర్త‌వ్య‌మ‌ని అన్నారు. మై హోమ్ అవ‌తార్‌లో సీబీఆర్ఈ స‌దుపాయాల్ని నిర్వ‌హిస్తోంద‌న్నారు. వారి ద్వారా వివిధ సేవ‌ల్ని అందించే స‌రైన టెక్నీషియ‌న్ల‌ను ఎంచుకుంటే.. నివాసితుల‌కు ఎలాంటి స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చ‌న్నారు.

ప్ర‌తిరోజు ఉద‌యం, సాయంత్రం కమ్యూనిటీలో వాకింగ్ చేసేట‌ప్పుడు అనేక మంది వారి స‌మ‌స్య‌ల్ని త‌న దృష్టికి తీసుకొస్తార‌ని తెలిపారు. మొత్తం ప‌ది ట‌వ‌ర్లు ఉండ‌గా.. ఒక్కో ట‌వ‌ర్లో 290కి పైగా ఫ్లాట్లు ఉంటాయ‌ని.. ఇప్ప‌టికే ప్ర‌తి ట‌వ‌రుకొక సూప‌ర్ వైజ‌ర్ ఉన్నార‌ని చెప్పారు. ఈ క్ర‌మంలో ప్ర‌తి ట‌వ‌రుకు ఒక‌ సెక్ర‌ట‌రీని నియ‌మించేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నామ‌ని అన్నారు. మెరుగైన నిర్వ‌హ‌ణ కోసం ప్ర‌త్యేకంగా కొత్త‌గా క‌మిటీల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. ఆడిట్ క‌మిటీ, వెండార్ క‌మిటీ, హెల్త్ క‌మిటీ, సీనియ‌ర్ సిటిజ‌న్ల‌తో అడ్వైజ‌రీ బాడీ వంటివి ఏర్పాటు చేస్తామ‌న్నారు. ఇంత బ‌డా క‌మ్యూనిటీలో స‌దుపాయాల్ని మెరుగ్గా నిర్వ‌హించేందుకు వ‌ర్క్ డివిజ‌న్ అనేది ఉండాల‌ని మేం అనుకున్నాం. అపార్టుమెంట్ నిర్వ‌హ‌ణ‌పై పూర్తిగా ప‌ట్టు సాధిస్తున్నామ‌ని చెప్పారు.

మై హోమ్ సంస్థ అనేక ప్రాజెక్టుల్ని నిర్మించింద‌ని.. అందులో అతిపెద్ద ప్రాజెక్టు మై హోమ్ అవ‌తార్ అని తెలిపారు. స‌మ‌యానికి ఫ్లాట్ల‌ను అందించ‌డంలో ఈ సంస్థ‌కు తిరుగులేద‌ని.. కాక‌పోతే క్వాలిటీ కంట్రోల్ మీద ప్ర‌త్యేక దృష్టి సారించాల‌న్నారు. ఇందుకోసం ప్ర‌త్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాల‌ని ఆయ‌న సూచించారు. ఫ్లాట్ల సంఖ్య పెరిగిన‌ప్పుడు.. ప్రాజెక్టు నాణ్య‌త మీద దృష్టి సారించ‌డం మీద క‌ష్ట‌త‌రం అవుతుంద‌ని.. అందుకే, నాణ్య‌త‌ను ప‌రీక్షించేందుకు విడిగా ఇండిపెండెంట్ టీమును ఏర్పాటు చేయాల‌ని సూచించారు. మై హోమ్ అవ‌తార్‌లో దేశం న‌లుమూల‌ల నుంచి అనేక మంది నివ‌సిస్తున్నార‌ని.. కాబ‌ట్టి ప‌నుల‌న్నీ ప‌క్కాగా చేప‌ట్టేందుకు.. ప్ర‌తిఒక్క‌ర్నీ క‌లుపుకుని వెళ్లాల‌ని నిర్ణ‌యించామ‌ని చెప్పారు.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles