- రియల్ ఎస్టేట్ గురుతో నటి ప్రియమణి
- 4 బీహెచ్ కే అంటేనే ఇష్టం
ప్రియమణి.. వెబ్ సిరీస్ లలో పవర్ ఫుల్ పాత్రలతో దూసుకెళ్తున్న నటి. ది ఫ్యామిలీ మ్యాన్, భామా కలాపం వంటి షోలలో తనదైన శైలిలో నటించి మెప్పించారు. ఈ నేపథ్యంలో సొంత ఇంటికి సంబంధించి ఆమె అభిరుచులు, ఆకాంక్షలు తెలుసుకునేందుకు రియల్ ఎస్టేట్ గురు ప్రయత్నించింది. దుబాయ్ లో ఇల్లు కొనుగోలు చేయాలనేది ఆమె డ్రీమ్ అని తెలిసింది. దుబాయ్ లో గోల్డెన్ వీసా నిబంధనలను ఇటీవల సవరించారు. దీంతో అక్కడ విలాసవంతమైన నివాసాలకు డిమాండ్ బాగా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రియమణి తన కల నెరవేర్చుకున్నారు.
‘మేమిద్దరం కలిసి కష్టపడటంతోనే దుబాయ్ లో కూడా ఇంటిని కొనుగోలు చేయగలిగాం. బ్యాంకింగ్ ప్రదేశం, పెట్టుబడులకు అనువైన స్థలం, మూలధన వృద్ధికి అవకాశాలు, సానుకూల చట్టాలు వంటి అంశాలు దుబాయ్ ను ఎంచుకోవడానికి ప్రధాన కారణాలు. ఇక మాది 1.5 బెడ్ రూమ్ అపార్ట్ మెంట్. బోలెడు సౌకర్యాలతో కూడిన అత్యంత విలాసవంతమైన అపార్ట్ మెంట్ లో నివసించడం చక్కని అనుభూతినిస్తుంది. పైగా ఉల్లాసభరితమైన గాలి మా ఇంటిని ఎల్లప్పుడూ తాజాదనంతో నింపుతుంది. మేం ఈ అపార్ట్ మెంట్ ను ఎంచుకోవడానికి మరో ప్రధాన కారణం.. ఎయిర్ పోర్టుకు సులువుగా రాకపోకలను సాగించవచ్చు. కేవలం ఏడే ఏడు నిమిషాల్లో విమానాశ్రయానికి వెళ్లొచ్చు’ అని వివరించారు.
తమ దుబాయ్ నివాసం గురించి ప్రియమణి ఇంకా చెబుతూ..
‘ఎత్తైన సీలింగ్స్, విలాసవంతమైన బాల్కనీ, కావాల్సినంత గోప్యత.. ఇవన్నీ నాకు చాలా ఇష్టం. ఇంకా చక్కని లైన్లు, సాధారణ రంగుల పాలెట్లు, అలంకరణ లేని ఉపరితలాలు కూడా ఇష్టం. నా ఫర్నిచర్ పై గంతులు వేయడం మాత్రం ఇష్టం ఉండదు. ఇంట్లో వాతావరణం ప్రశాంతత, సామరస్యం, ఆధ్యాత్మిక భావనలు కలిగించేలా ఉండాలి’ అని పేర్కొన్నారు. వ్యక్తులందరికీ ఒకే రకమైన అభిప్రాయాలు ఉండవు. వేర్వేరు వ్యక్తులు వేర్వేరు ఆకాంక్షలు కలిగి ఉంటారు. అలాగే ప్రతి వ్యక్తికీ వారి సొంత అవసరాలు కొన్ని ఉంటాయి. ఆ మేరకే వారు తమకు కావాల్సిన గృహాలను ఎంచుకుంటారు. ఇక ప్రియమణికి ఈ విషయంలో విల్లాలు సరైన చాయిస్. అది ఆమె జీవనశైలి గురించి తెలియజేస్తుంది.‘ఏది ఏమైనప్పటికీ నా వరకు ఆదర్శవంతమైన ఇల్లు అంటే నా చుట్టూ ఉన్న నాకిష్టమైన వ్యక్తులతోనే ఉంటుంది. మరింత కచ్చితంగా చెప్పాలంటే నేను 4 బీహెచ్ కే ఇష్టపడతాను. కానీ అది ఫర్నిచర్ తో చిందరవందరగా ఉండకూడదు. కేవలం విలాసవంతమైన, అధునాతనతకు చిహ్నంగా ఉంటే చాలు’ అని తెలిపారు.
షూటింగ్ లేనపుడు ఎక్కడ ఉంటారని ప్రశ్నించగా.. వైఫై ఎక్కడుంటే అక్కడ ఉంటానని బదులిచ్చారు. ‘మీ అపార్ట్ మెంట్ సానుకూలత, శాంతి, ప్రశాంతతో నిండి ఉండటంతో కొన్ని ప్రాథమిక ప్రయోజనాలు కలుగుతాయి. ఇక మన అపార్ట్ మెంట్ నుంచి సముద్ర వీక్షణ ఉండటం.. కేక్ పై చెర్రీ మాదిరిగా అనిపిస్తుంది. నా ఇల్లు నా కుటుంబంలోని ప్రతి ఒక్కరికి తగినంత వ్యక్తిగత స్థలం కలిగి ఉండాలి. ఇది హద్దులు లేని మీ నైపుణ్యానికి ప్రామాణికంగా నిలుస్తుంది’ అని ముగించారు.