లగ్జరీ బిజినెస్ సర్వీస్ అపార్ట్ మెంట్లకు ఎనలేని డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా ప్రొఫెషనల్స్ అధిక నాణ్యత కలిగిన జీవితంతోపాటు అనువైన లివింగ్ స్పేస్ ను కోరుకుంటున్నారు. తమ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి అవసరమైన సదుపాయాలను కలిగి ఉన్న లగ్జరీ బిజినెస్ సర్వీస్ అపార్ట్ మెంట్ల వైపు మొగ్గు చూపిస్తున్నారు. దీంతో వీటికి డిమాండ్ బాగా పెరిగింది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రీమియం సౌకర్యాలతోపాటు అత్యంత అనుకూలమైన అంశాలను ఈ అపార్ట్ మెంట్లు ఆఫర్ చేస్తుండటంతో చాలామంది వీటినే ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా బిజినెస్ ట్రావెలర్లు, రిమోట్ వర్కర్లు లగజరీ కో లివింగ్ స్పేసెస్ కు జై కొడుతున్నారు.
ప్రీమియం లివింగ్ అనుభూతితోపాటు అధునాతన సాంకేతికతతో కూడిన స్మార్ట్ హోమ్ టెక్నాలజీ వంటివి ఇందులో ఉండటంతో చాలామంది పీజీ అకామిడేషన్లను కాదని వీటిని ఎంచుకుంటున్నారు. పరిశుభ్రమైన వాతావరణం, అత్యంత సమర్థంగా ప్రాపర్టీ నిర్వహణ వంటివి వారిని ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా స్థిరంగా ఉన్న వడ్డీ రేట్లు, సానుకూలంగా ఉన్న ఆర్థిక వాతావరణం, వేగవంతమైన మౌలిక వసతుల వృద్ధి వంటివి వీటి డిమాండ్ పెరగడానికి దోహదపడుతున్నాయి. మనదేశ ఆర్థిక పరిస్థితి కూడా సానుకూలంగా ఉండటంతో లగ్జరీ,అల్ట్రా లగ్జరీ సరఫరా కూడా క్రమంగా పెరుగుతోంది. దీంతో రియల్ ఎస్టేట్ రంగంలో హౌసింగ్ డిమాండ్ ఇలాగే కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్ను. మంచి ట్రాక్ రికార్డు ఉన్న డెవలపర్లు భారీగా లబ్ధి పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సానుకూల వాతావరణం రియల్ ఎస్టేట్ మార్కెట్ ను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడమే కాకుండా ఇన్వెస్టర్లు, డెవలపర్లు, ఇళ్ల కొనుగోలుదారులకు మరిన్ని అవకాశాలు కల్పిస్తాయి.
This website uses cookies.