Categories: TOP STORIES

భవనాల్ని జీరో ఎనర్జీగా చేయండిలా సీఐఐ ఐజీబీసీ నేషనల్ వైస్ చైర్మన్ సి. శేఖర్ రెడ్డి

సీఐఐ ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షో సెకండ్ ఎడిషన్
⁠వేదిక: హైటెక్స్
⁠తేదీలు: మే 17 -19

పునరుత్పాదక శక్తి వనరుల ద్వారా భవనాల్ని జీరో ఎనర్జీ బిల్డింగ్ గా చేసుకోవచ్చని సీఐఐ ఐజీబీసీ జాతీయ వైస్ చైర్మన్ సి. శేఖర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో సీఐఐ ఐజీబీసీ
సెకండ్ ఎడిషన్ ప్రాపర్టీ షో సందర్భంగా రియల్ ఎస్టేట్ గురు తో మాట్లాడుతూ.. పునరుత్పాదక శక్తిని వినియోగించుకున్నదానికి సమానంగా ఉత్పత్తి చేసే అవకాశం ఇక్కడ ఉంటుందని అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

విద్యుత్ డిమాండ్ ను తగ్గించుకోవడం, పునరుత్పాదక శక్తి వనరుల వైపు వంద శాతం వెళ్లడం వంటి సమర్థవంతమైన చర్యలు అవలంభించడం ద్వారా ఈ లక్ష్యాలను చేరుకోవచ్చన్నారు. హరితం అంటే.. మెటీరియల్స్ తోపాటు లోపలి పర్యావరణ విధానం, వ్యర్థాల నిర్వహణ, కార్బన్ ఉద్గారాలనియంత్రణ, సహజ వనరులను సంరక్షించు కోవడం తదితరాలన్నీ కలిసిందని వివరించారు. ప్రస్తుతం నగరాల్లో క్రాస్ వెంటిటేషనల్ వంటి సంప్రదాయ విధానాలకు దూరంగా నిర్మాణాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. భవనాలకు కచ్చితమైన నియమ నిబంధనలు ఉన్నప్పటికీ ఎవరూ సరిగా పాటించడంలేదని విమర్శించారు. పైగ హరిత భవనాల నిర్మాణాలకు సంప్రదాయ నిర్మాణాల కంటే ఎక్కువ వ్యయం కూడా కాదని స్పష్టం చేశారు. అలాయ్స్, పాలిమర్స్ వంటి తక్కువ బరువు కలిగిన మెటీరియల్స్ తోపాటు నిర్మాణ సైట్ల నుంచి ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను పునర్ వినియోగించడం, గ్రీన్ బిల్డింగ్ రెగ్యులేన్స్ పాటించడం ద్వారా నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవచ్చని వివరించారు.

This website uses cookies.