మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ తెలంగాణలో గోల్డ్ అండ్ డైమండ్ జ్యుయెలరీ ఉత్పత్తి కేంద్రాన్ని ఆరంభిస్తోందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ క్రమంలో భాగంగా ఆ సంస్థ దాదాపు రూ.750 కోట్ల పెట్టుబడులు పెడుతోందని వెల్లడించారు. దీని వల్ల దాదాపు రెండు వేల ఐదు వందల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. బుధవారం నగరంలో జరిగిన కార్యక్రమంలో మలబార్ గోల్డ్ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో కజకిస్థాన్ కాన్సులేట్ నాసిర్ అలీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.