కలల గృహాన్ని నిర్మించే ప్రక్రియను అర్థం చేసుకున్నందుకు నటి మాళవిక మోహనన్ ఎంతో ఉత్సాహంతో ఉన్నారు! సృజనాత్మకత కలిగిన ఈ ముద్దుగుమ్మ తన కోసం ఒక వెకేషన్ హోమ్‌ను నిర్మించుకోవడానికి వాయనాడ్ సమీపంలో ఒక అందమైన ప్రదేశాన్ని ఎంచుకున్నారు. “నా కుటుంబంతో కలిసి జీవించడం పెరిగింది. ఈ రంగంలోకి వచ్చేంత వరకూ బయటకు వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదు. మేజర్‌గా మారిన వెంటనే చాలామంది పాశ్చాత్య సంస్కృతి వైపు మొగ్గు చూపుతారు.
నా స్నేహితుల్లో చాలామంది అటు వైపే వెళ్లారు. కానీ, నేను మాత్రం అలా భావించలేదు. నేటికీ నాకు కుటుంబంతో సమయం గడపటమే ఎంతో ఇష్టం. వాళ్లు నాపై చూపిన ప్రేమే కాకుండా, ఆ పరిసరాలే నన్ను ఈరోజు క్రమశిక్షణ గల స్త్రీని చేశాయి! నేను ఏమాత్రం బ్యాలెన్స్ తప్పుతున్నట్లు అనిపిస్తే వెంటనే నన్ను పిలుస్తారు. నన్ను ఎప్పటికప్పుడు కనిపెడుతుంటారు. ఇంకా నేను ఈ వృత్తిలో ఎదగాల్సి ఉంది.
వాయనాడ్ నగర జీవితం ఎప్పుడైనా నా మనసును తాకినప్పుడు కొంత నిర్లిప్తత వస్తుంది. అటవీ ప్రాంతాన్ని ప్రేమిస్తాను కాబట్టి.. కేరళలో మొదటి ప్లాట్‌ను కొనుగోలు చేశాను. ఇక నేను ఎప్పుడైనా అటవీ ప్రాంతానికి తిరిగి వెళ్లిపోవచ్చు. అంతే కాదు, అందులో రబ్బరు అరటి కూడా ఉంది. అక్కడ ఒక కాటేజీని నిర్మించాలనే ప్రణాళికతో ఉన్నాను. వాయనాడ్ రబ్బరు తోటల్లో ప్రశాంతతను కలిగించే రహస్య ప్రదేశంలో ఉంటాను. కొబ్బరితోటలతో నిండుకున్న ప్రకృతిలో నివసిస్తాను. అక్కడైతే కప్పల శబ్దాల్ని వింటూ పడుకోవచ్చు. పక్షి పాటలతో మేల్కోవచ్చు.
మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా నాన్న పోరాటశక్తిని చూశాను. తన కెరీర్‌లో పెరుగుదలతో, మా ఇళ్ళు కూడా విస్తరించాయి. ప్రస్తుతం మేం మూడో ఇంట్లో ఉంటున్నాం. మాకున్న చిన్న ఇల్లు కూడా మరచిపోలేను. ఎందుకంటే అక్కడే మా అన్న పెరిగారు. అమ్మ మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకునేది. మేం దక్షిణ-భారత దేశం నుంచి రావడం వల్ల మా ఇంటి డిజైన్ భూమితో ఎంతో దగ్గర సంబంధం ఉండేలా ఉంటుంది. తమిళనాడు నుండి శిల్పాలను తెచ్చాం. గదిలో సంప్రదాయ పలకలున్నాయి, ఇత్తడి మరియు లోహాలతో చేసిన మా కుండీలు, ఇత్తడితో చేసిన దేవతల బొమ్మలు మరియు ప్రసిద్ధ రాజా రవివర్మ చిత్రాలు ఉన్నాయి. ముదురు చెక్కతో నాకు అపారమైన ప్రేమ ఉంది. పచ్చదనం కూడా నన్ను చాలా ఆకర్షిస్తుంది. మాకు నాలుగు భారీ బాల్కనీలు ఉన్నాయి. కాకపోతే, నా ఇంట్లో ఒక్క మొక్క కూడా లేదు.
This website uses cookies.