- వంశీరామ్ బిల్డర్స్ నుంచి అదిరిపోయే ప్రాజెక్టు
- 8 టవర్లు.. 978 విలాసవంతమైన యూనిట్లు
- 2029 మార్చి నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక
మన్ హట్టన్.. న్యూయార్క్ లోనే కాదు, ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన ప్రదేశం. నిద్రపోని నగరంగా పేరుపొందిన మన్ హట్టన్.. అమెరికా ఆర్థిక, సాంస్కృతిక, వాణిజ్య రాజధానిగా వెలుగొందుతోంది. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, టైమ్స్ స్క్వేర్ వంటి ఎన్నో ప్రముఖ కట్టడాలకు నిలయం. ఇక్కడి ఆర్కిటెక్చర్ అటు చారిత్రక, ఇటు ఆధునిక కలబోతతో ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రపంచంలోనే ప్రత్యేకమైన, విలాసవంతమైన రియల్ ఎస్టేట్ కు చిరునామాగా కూడా ఈ ప్రాంతం భాసిల్లుతోంది. అలాంటి మన్ హట్టన్ తరహా లగ్జరీ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ లో కూడా ఉంటే బావుంటుంది కదూ? అనుకునేవారికి ఇదో శుభవార్త. రియల్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వంశీరామ్ బిల్డర్స్.. మన్ హట్టన్ ను భాగ్యనగరానికి తీసుకొచ్చేసింది. ఖాజాగూడలో మన్ హట్టన్ తరహాలో హైరైజ్ రెసిడెన్షియల్ ప్రాజెక్టు లాంచ్ చేసింది.
విలావంతమైన జీవనంలో ఓ కొత్త పరిణామాన్ని పరిచేయం చేసే ఉద్దేశంతో మన్ హట్టన్ ప్రాజెక్టు ప్రారంభించింది. 15 ఎకరాల సువిశాల స్థలంలో 8 టవర్లతో 978 యూనిట్లను అదిరిపోయే విధంగా నిర్మిస్తోంది. 2011 చదరపు అడుగుల నుంచి 14,099 చదరపు అడుగుల పరిమాణంలో 3, 4, 5 బీహెచ్ కే యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి. గతేడాది ఏప్రిల్ లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. 2029 మార్చి నాటికి పూర్తి చేసే సంకల్పంతో ఎక్కడా రాజీపడకుండా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారు. 5వ అవెన్యూ బ్రాండెడ్ రెసిడెన్సీస్ కింద ఏ, డి టవర్లలో ఒక అంతస్తుకి ఒక యూనిట్ (14,099 చదరపు అడుగులు) మాత్రమే ఉంటుంది.
బి, సి టవర్లలో అంతస్తుకు రెండు యూనిట్లు (9,599 చదరపు అడుగులు) ఉంటాయి. 4వ అవెన్యూ లగ్జరీ రెసిడెన్సీస్ కింద జి, హెచ్ టవర్లలో అంతస్తుకు నాలుగు యూనిట్లు (రెండు 6,399 చదరపు అడుగులు, రెండు 5,039 చదరపు అడుగులు) ఉండగా.. ఈ, ఎఫ్ టవర్లలో అంతస్తుకు నాలుగు యూనిట్లు (రెండు 5,739 చదరపు అడుగులు, రెండు 5,039 చదరపు అడుగులు) ఉంటాయి. అలాగే 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సమస్త సౌకర్యాలతో ఓ క్లబ్ హౌస్ కూడా నిర్మిస్తున్నారు. ఇంటర్నెట్, వైఫై, వాస్తు అనుకూలం, ల్యాండ్ స్కేపింగ్, ఫైర్ ఫైటింగ్ వ్యవస్థ, కమ్యూనిటీ బిల్డింగ్స్, క్లోజ్డ్ కార్ పార్కింగ్, 24 గంటల నీటి సరఫరా, వీధి దీపాలు, పైప్ గ్యాస్ కనెక్షన్, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఇంటర్ కమ్, రిక్రియేషన్ సౌకర్యాలు, 24 గంటల సీసీ టీవీ నిఘా, వీడియో డోర్ సౌకర్యం, కార్ వాష్ ఏరియా, పవర్ బ్యాకప్ వంటి చాలా సౌకర్యాలున్నాయి.