- ముంబైలో ఫ్లాట్ అద్దెకు తీసుకున్న నటి ఊర్వశీ రౌతేలా
బాలీవుడ్ నటి, మోడల్ ఊర్వశీ రౌతేలా ముంబైలోని విల్ పార్లే (వెస్ట్) ప్రాంతంలో ఓ అపార్ట్ మెంట్ ను నెలకు రూ.6 లక్షలు చెల్లించేలా అద్దెకు తీసుకున్నారు. 3600 చదరపు అడుగుల అపార్ట్ మెంట్ ను మూడు నెలల కాలానికి ఆమె అద్దెకు తీసుకున్నారు. 2025 జనవరి నుంచి 2025 మార్చి వరకు అద్దె ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఈనెల 16న ఒప్పందం రిజిస్టర్ అయింది. ఈ 3 బీహెచ్ కే అపార్ట్ మెంట్ కు రెండు కార్ పార్కింగులు ఉన్నాయి. తన వ్యక్తిగత వినియోగం, కుటుంబ సభ్యుల నివాసం కోసం తాత్కాలికంగా అద్దెకు తీసుకుంటున్నట్టు ఒప్పందంలో పేర్కొన్నారు.
ఇందుకోసం రూ.19.5 లక్షల వడ్డీ రహిత సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించారు. వాస్తవానికి నెలకు ఇంత పెద్ద్ మొత్తంలో అద్దె చెల్లించి ఉండటం కంటే ఇల్లు కొనుక్కోవడమే ఉత్తమం కదా అనే చర్చ ఎడతెగకుండా సాగుతూనే ఉంటుంది. అయితే, భారతీయ యువత అపార్ట్ మెంట్‌ను కొనుగోలు చేయడం కంటే అద్దెకు తీసుకోవడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వాటిలో ఒకటి ఫ్లెక్సిబిలిటీ. ఇంటిని కొంటే ఆ మేరకు మీరు లాక్ అయిపోతారు.
అదే అద్దెకు తీసుకుంటే అన్ని రకాలుగా సౌలభ్యంగా ఉంటుంది. పెద్ద మొత్తం వెచ్చించి ఇల్లు కొనడం కంటే అద్దెకు తీసుకోవడం 2 నుంచి 3 శాతం చవకైనది. ఒకవేళ మీరు ఇంటికి రుణం తీసుకున్నట్టయితే, మీ సొంత ఇంటికి పెట్టే ఖర్చు గణనీయంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కొంతమంది ఇల్లు కొనడం కంటే అద్దెకు తీసుకోవడానికే మొగ్గు చూపిస్తారు. పైగా వారు కోరుకునే ఇల్లు కొనడానికి వీలుపడలేని సందర్భాల్లోనూ అద్దెకు తీసుకోవడానికి ఇష్టపడతారు.