మెట్రో ప్రాజెక్టుతో మారిపోనున్న హైదరాబాద్ ఉత్తరం
హైదరాబాద్ ఉత్తర భాగం నగరవాసులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ నార్త్ సిటీకి మెట్రో రైల్ పొగడించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ కు, జేబీఎస్ నుంచి శామీర్ పేట్ వరకు మెట్రో రైల్ ను మెట్రో రైల్ ప్రాజెక్టును విస్తరించాలని తెలంగాణ సర్కార్ డిసైడ్ అయ్యింది. ఈ రెండు కారిడార్ల డీపీఆర్ ల తయారీకి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మెట్రో రైల్ ఫేజ్-2 ‘బి’ భాగంగా వెంటనే డీపీఆర్ లను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపించాలని హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని ఆదేశించారు.
ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు 23 కిలో మీటర్ల మేర మెట్రో కారిడార్ లో ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుండి తాడ్ బన్డ్, బోయినపల్లి, సుచిత్ర సర్కిల్, కోంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్ వరకు రూట్ ఉంటుంది. అదే విధంగా జేబీఎస్ నుంచి శామీర్ పేట్ వరకు 22 కిలో మీటర్ల మేర ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుండి విక్రంపురి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, ఆల్వాల్, బొల్లారం, హకింపేట్, తూముకుంట, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా శామీర్ పేట్ ఈ కారిడార్ విస్తరించనున్నారు. ప్యారడైజ్- మేడ్చల్ (23 కిలోమీటర్లు) జేబీఎస్- శామీర్ పేట్ (22 కిలోమీటర్లు) మెట్రో కారిడార్ల డీపీఆర్ తయారీని 3 నెలల్లో పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మెట్రో ఫేజ్-2 ‘ఏ’ భాగం లాగే ‘బి’ భాగాన్ని కూడా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ ప్రాజెక్టుగా చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
మేడ్చల్ వైపు జోరందుకోనున్న రియల్ ఎస్టేట్
పేరున్న విద్యాసంస్థలు, ఆసుపత్రులు, వినోద కేంద్రాలు, పచ్చదనంతో నివాసాలకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో హైదరాబాద్ ఉత్తరంవైపున్న మేడ్చల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు కనెక్టివిటీ ఉండటం, ఇప్పుడు మెట్రోతో రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది. కండ్లకోయలో ఐటీ పార్క్ వస్తుండటంతో చాలా మంది ఇక్కడ స్థిరాస్తిపై పెట్టుబడిపెట్టేందుకు ఆసక్తిచూపుతున్నారు. సికింద్రాబాద్, కూకట్ పల్లి లాంటి ప్రాంతాల్లో ఇంటి ధరలు అధికంగా ఉండటంతో మద్యతరగతి వారంతా మేడ్చల్ వైపు చూస్తున్నారు. అందరికి అందుబాటు ధరల్లో ఇక్కడ ఇంటి స్థలాలు, అపార్ట్ మెంట్ లో ఫ్లాట్లు దొరుకుతున్నాయి. నాగ్‌పూర్ జాతీయ రహదారి, కరీంనగర్ రహదారి చుట్టుపక్కల జోరుగా నిర్మాణ ప్రాజెక్టులు వెలుస్తున్నాయి. భారీ వాణిజ్య భవనాలు, మల్టీప్లెక్స్‌లు, బహుళ అంతస్తుల నివాస సముదాయాలు ఇక్కడ పెద్ద ఎత్తున నిర్మాణంలో ఉన్నాయి. సుచిత్ర, కొంపల్లి, మేడ్చల్ ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ల నిర్మాణం జరుగుతుండగా, వ్యక్తిగత ఇళ్లు, విల్లాలు, ఓపెన్ ప్లాట్ వెంచర్లు మాత్రం ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల వెలుస్తున్నాయి.
ఇక ధరల విషయానికి వస్తే హైదరాబాద్ లోని ముఖ్యమైన ప్రాంతాలతో పొలిస్తే మేడ్చల్ లో చాలా తక్కువే అని చెప్పవచ్చు. సికింద్రాబాద్, కూకట్ పల్లిలో డబుల్ బెడ్రూం ఫ్లాట్ కొనాలంటే కనీసం 80 లక్షల నుంచి కోటి రూపాయలు పెట్టాల్సింటే. కానీ మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ల ధరలు చదరపు అడుగు 4వేల రూపాయల నుంచి 6 వేల రూపాయల వరకు నడుస్తోంది. అంటే కోంపల్లి, సుచిత్రా, మేడ్చల్ సమీప ప్రాంతాల్లో డబుల్ బెడ్రూం ఫ్లాట్ 45 లక్షల నుంచి మొదలు 70 లక్షల వరకు దొరుకుతుంది. ఇక విల్లా ఐతే 1 కోటి 50 లక్షల నుంచి మొదలవుతుండగా నిర్మాణం, విస్తీర్ణాన్ని బట్టి 5 కోట్ల రూపాయల వరకు ధరలున్నాయి. సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న వారికి ఓపెన్ ప్లాట్లు సైతం అందుబాటు ధరల్లో ఉన్నాయి. మేడ్చల్ సమీప ప్రాంతాల్లో చదరపు గజం 25 వేల రూపాయల నుంచి 45 వేల రూపాయల వరకు పలుకుతోంది. మొత్తానికి దిగువ మధ్య కరగతి, మధ్య తరగతి వారు, ఉద్యోగులు తమ సొంతింటి కలను నెరవేర్చుకోవాలంటే మాత్రం తమ తమ బడ్జెట్ కు అనుగునంగా మేడ్చల్ సమీపంలో కొనుగోలుచేయవచ్చు.
మారిపోనున్న షామీర్ పేట్ పరిసరాలు
మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణతో షామీర్ పేట్ పరిసరాలు కనీవినీ ఎరుగని రీతిలో మారిపోనున్నాయి. ఇప్పిటికే షామీర్ పేట్ చుట్టుపక్కల ప్రాంతంలో భారీ నిర్మాణ ప్రాజెక్టులు వెలుస్తున్నాయి. అందరికి అందుబాటు ధరలో అపార్ట్ మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, విల్లాలు లభిస్తుండటంతో అంతా షామీర్ పేట్ వైపు చూస్తున్నారు. నగరంలో జీవనం ఆర్థిక భారంగా మారిన మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ఖర్చులో అన్ని వసతులు ఉన్న కేంద్రంగా షామీర్ పేట్ ఆకర్షిస్తోంది. షామీర్ పేట్ దగ్గర ప్రతిష్టాత్మకమైన నల్సార్ లా యూనివర్సిటీతో పాటు అంతర్జాతీయ సంస్థలతో కూడిన జీనోమ్ వ్యాలీ, ఇండస్ట్రియల్ ఏరియా ఉండటంతో ఇక్కడ ఉపాది అవకాశాలు ఏక్కవగా ఉన్నాయి. అంతే కాదు ప్రముఖ విద్యా సంస్థలన్నీ షామీర్ పేట్ పరిసర ప్రాంతంలో ఏర్పాటయ్యాయి. షామీర్ పేట్ రాజీవ్ రహదారి, అవుటర్ రింగ్ రోడ్డుకు అత్యంత చేరువలో ఉంది. మేడ్చల్ జిల్లా కొత్త కలెక్టరేట్ సైతం షామీర్ పేట్ కు దగ్గర్లో ఉండటం విశేషం. శామీర్‌పేట సహా చుట్టుపక్కల ప్రాంతాలు మున్సిపాలిటీలుగా మారడంతో ఇక్కడ ఇంటి కొనుగోలుకు అంతా మొగ్గు చూపుతున్నారు.
షామీర్ పేట్ లో మధ్య తరగతి వారికి అందుబాటు ధరల్లో అపార్ట్ మెంట్ లో ఫ్లాట్స్, ఇండిపెండెంట్ ఇళ్లు లభిస్తున్నాయి. షామీర్ పేట్ దగ్గర శ్రీనాధ్ కన్ స్ట్రక్షన్స్ నిర్మిస్తున్న అపార్ట్ మెంట్ లో 945 చదరపు అడుగుల విస్తీర్ణంలో డబుల్ బెడ్రూం ఫ్లాట్ 45 లక్షల్లో లభిస్తోంది. ఇందు హోమ్స్ నిర్మిస్తున్న ఇందు క్రాంతి ప్రాజెక్టులో 1200 చదరపు అడుగుల విస్తీర్ణంలో డబుల్ బెడ్రూం ఫ్లాట్ 52 లక్షల్లో లభిస్తోంది. షామీర్ పేట్ దగ్గర పారిజాత హోమ్స్ అండ్ డెవలపర్స్ నిర్మిస్తున్న పారిజాత ఐకాన్ ప్రాజెక్టులో 900 చదరపు అడుగుల విస్తీర్ణంలో లభించే ఫ్లాట్స్ 60 లక్ష్లల్లో అందుబాటులో ఉన్నాయి. ఇక విల్లాలకు వచ్చే సరికి 1.2 కోట్ల నుంచి మొదలు 8 కోట్ల రూపాయల వరకు ప్రాజెక్టును బట్టి ధరలున్నాయి. షామీర్ పేట్ దగ్గర ప్రజయ్ హోమ్స్ నిర్మిస్తున్న ట్రీ టాప్స్ ప్రాజెక్టులో 4 బీహెచ్కే విల్లా 2.15 కోట్ల రూపాయల్లో లభిస్తోంది. ఇక షామీర్ పేట్ లో డీటీసీపీ లేఅవుట్ లో ఇంటి స్థలం చదరపు గజం ప్రాంతాన్ని బట్టి 16 వేల రూపాయల నుంచి మొదలు 40 వేల రూపాయల వరకు అందుబాటులో ఉన్నాయి.