Categories: TOP STORIES

కోకాపేట్ నియోపోలీస్ వరకు మెట్రో రైలు

  • రెండో దశలో 78.4 కి.మీ మెట్రోకు 24 వేల కోట్లు
  • శంకర్ పల్లి, చేవెళ్ల వరకు పెరగనున్న నిర్మాణాలు

హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణతో నగరం మరింత అభివృద్ది చెందనుంది. ఇప్పటికే శివారు ప్రాంతాల్లో మౌలిక వసతులు ఏర్పడగా, ముందు ముందు నగరం ఇంకొంత విస్తరించనుంది. మెట్రో రెండవ దశలో దూరంతో పాటు అంచనా వ్యయం భారీగా పెంచుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ప్రతిపాదించింది తెలంగాణ ప్రభుత్వం. గతంలో మొత్తం 5 కారిడార్లలో 70 కిలో మీటర్ల దూరం ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కిలో మీటర్లు పెరిగి 78.4 కిలో మీటర్లకు చేరింది. దీంతో మొత్తం మెట్రో రైల్ విస్తణర ప్రాజెక్టు అంచనా వ్యయం 24,042 కోట్లకు చేరుకుంది.

అంతకు ముందు హైటెక్ సిటీ సమీపంలోని రాయదుర్గం మెట్రో స్యేషన్ నుంచి విప్రో సర్కిల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని అమెరికా కాన్సులేట్ వరకు 8 కిలో మీటర్ల మేర మార్గాన్ని ప్రతిపాదంచింది ప్రభుక్వం. ఇప్పుడు మరికొంత విస్తరించి కోకాపేటలోని నియోపోలిస్ వరకు మెట్రో ప్రాజెక్టును చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సుమారు 3.3 కిలో మీటర్ల మేర మెట్రో మార్గం పెరిగింది. అంతే కాదు మెట్రో ట్రైన్ డిపో సైతం కోకాపేట్ లోనే నిర్మించేందుకు అవసరమైన భూముల కోసం సర్వే చేస్తోంది సర్కార్.

మరో మార్గంలో నాగోలు, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి సర్కిల్ నుంచి జల్‌పల్లి మీదుగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ముందు 29 కిలో మీటర్లుగా ఎయిర్‌పోర్ట్ మెట్రోని అంచనా వేసింది ప్రభుత్వం. మైలార్‌దేవ్‌పల్లి నుంచి ఆరాంఘర్, నూతన హైకోర్టు వరకు 5 కిలో మీటర్ల మార్గాన్ని పెంచుతూ బడ్జెట్ లో ప్రతిపాదించారు. ఇక మియాపూర్-పటాన్‌చెరు, ఎల్బీనగర్-హయత్‌నగర్, ఫలక్‌నుమా-చాంద్రాయణగుట్ట కారిడార్లలో మార్పులు లేవని స్పష్టం చేసింది రేవంత్ సర్కార్.

కోకాపేట్ వరకు మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరిస్తుడటంతో ఆ ప్రాంతం మరింత అభివృద్ది చెందనుందని అంచనా వేస్తున్నారు. ఐటీ కారిడార్ కు దగ్గరగా ఉండటంతో ఇప్పటికే కోకాపేట్ తో పాటు పరిసర ప్రాంతాలు అనుకున్నదానికకంటే ఎక్కువగానే డెవలప్ అయ్యాయి. ఇప్పుడు మెట్రో రైల్ తో అటు శంకర్ పల్లి, ఇటు చేవెళ్ల వరకు రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ది చెందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రవాణా సౌకర్యం మెగుగైతే కాస్త దూరమైనా ఇళ్లు కొనేందుకు మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వారు ఆసక్తి చూపుతారని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.

This website uses cookies.