Ramky Estates Welcomes Union Budget Presented by Nirmala Seetharaman
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన కేంద్ర బడ్జెట్ రియల్ ఎస్టేట్ రంగానికి అనేక ఆశాజనకమైన చర్యలను ప్రవేశపెట్టిందని రాంకీ ఎస్టేట్స్ ఎండీ నందకిశోర్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా భూమి రికార్డుల డిజిటలైజేషన్‌తో పాటు పారదర్శకమైన ఆస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ లావాదేవీల సామర్థ్యాన్ని పెంచుతుందని తెలిపారు. మెట్రో రైలు ప్రాజెక్టులు మరియు స్మార్ట్ సిటీలతో సహా పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో పెట్టుబడుల్ని పెంచడం వల్ల మెట్రో నగరాలు వృద్ధి చెందుతాయని అన్నారు.
ఆస్తి విక్రయాలపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (LTCG – ఎల్టీసీజీ)ని 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించడం స్వాగతించాల్సిన అంశమన్నారు. కాకపోతే, 2001 తర్వాత కొన్న ఆస్తులకు సంబంధించి ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని తొలగించడం వల్ల కొంతమేరకు ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. ముఖ్యంగా మూడు నుంచి ఐదేళ్లలోపు గల ఆస్తుల విక్రయాల్లో కనిపిస్తుందన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద పెరిగిన నిధులు మరియు వడ్డీ రాయితీల ద్వారా అందుబాటు గృహాలకు ప్రభుత్వం నిరంతరం మద్ధతు తెలుపుతోందన్నారు. దీని వల్ల ఆర్థికంగా బలహీనవర్గాల సొంతింటి కల సాకారం అవుతుందన్నారు. గ్రామీణ మరియు సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం ద్వారా అల్పాదాయ వర్గాలకు ప్రయోజనం లభిస్తుందన్నారు.
This website uses cookies.