Categories: LATEST UPDATES

మియాపూర్ బాచుపల్లి రోడ్డును విస్తరించాలి!

జేఎన్టీయూ దాటిన తర్వాత మియాపూర్ నుంచి బాచుపల్లి రోడ్డు దాకా ఎక్కడలేని ట్రాఫిక్ ఉంటుంది. రేటు అందుబాటులో ఉందనే ఒకే ఒక్క అంశం కారణంగా చాలామంది నిజాంపేట్లోనే ఫ్లాట్లను కొనుగోలు చేశారు. ఇక తప్పదన్నట్లు ఈ ట్రాఫిక్ జామ్లో పడి ఆఫీసులకు వెళ్లడం అలవాటు చేసుకున్నారు. తాజాగా, ఈ జాబితాలోకి మియాపూర్ నుంచి బాచుపల్లి రోడ్డు కూడా చేరుకుంది. మియాపూర్ చౌరస్తా నుంచి బస్ డిపో మీదుగా బాచుపల్లి వెళ్లాలంటే ప్రతి రోజూ ప్రత్యక్ష నరకం కనిపిస్తోంది. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండటం, స్కూళ్లకు సెలవులుండటంతో సరిపోయింది. ఒక్కసారి ఆఫీసులు, స్కూళ్లు ఆరంభమైతే, ఇక ప్రతిరోజు నిత్య నరకమే ఎదురువుతుంది. ఈ రోడులో ఇంతగా ట్రాఫిక్ పెరగడానికి ప్రధాన కారణాలేమిటి?

మియాపూర్ నుంచి బాచుపల్లి, మల్లంపేట్, బౌరంపేట్ దాకా చాలామంది ఫ్లాట్లను కొనుగోలు చేశారు. వీరంతా ఈ రోడ్డు నుంచే నిత్యం రాకపోకల్ని సాగిస్తుంటారు. అంతేకాకుండా, ఇటీవల కాలంలో మియాపూర్ మెయిన్ రోడ్డు మీదే ఆకాశహర్మ్యాలకు జీహెచ్ఎంసీ అనుమతిని మంజూరు చేసింది. ప్రస్తుతమున్న రహదారిని వెడల్పు చేయకుండా.. ఇలా అనుమతులను మంజూరు చేయడంతో ఒక్కసారిగా ఆయా సంస్థల నిర్మాణ వాహనాల రాకపోకలూ పెరిగాయి. ఈ అపార్టుమెంట్ నుంచి బయటికి వాహనం రావాలంటే.. రోడ్డు మీద ట్రాఫిక్ మొత్తం నిలిచిపోవాల్సి వస్తోంది. పైగా, వర్టెక్స్ విరాట్ వద్ద యూ టర్న్ తీసుకునేటప్పుడు.. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోతున్నాయి. ఇలా, నిర్మాణ వాహనాల వల్ల ట్రాఫిక్ రద్దీ అధికమవుతోంది. కాబట్టి, ఇప్పటికైనా ఈ రహదారిని వెడల్పు చేయాలని మియాపూర్ ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

This website uses cookies.