తెల్లాపూర్, కొల్లూరు, పాటి ఘనపూర్.. హైదరాబాద్‌లో హాట్ లొకేషన్లు..
గచ్చిబౌలి, నలగండ్ల, కోకాపేట్ తర్వాత అవి ఉండటమే ప్రధాన ఆకర్షణ..
అధిక శాతం డెవలపర్లూ ఈ ప్రాంతాల్ని ఎంచుకోవడానికి కారణమిదే!
కొందరు అపార్టుమెంట్లను కడితే.. మరికొందరు విల్లాల్ని కడుతున్నారు.
ఎందుకీ ప్రాంతాల్లో నిర్మాణాలు, అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి?
హైదరాబాద్‌లోని తెల్లాపూర్, కొల్లూరు, పాటి ఘనపూర్ వంటి ప్రాంతాల్లో పలు సంస్థలు అపార్టుమెంట్లను ఆరంభించాయి. ఇందులో కొన్ని వ్యక్తిగత అపార్టుమెంట్లు కాగా మరికొన్ని గేటెడ్ కమ్యూనిటీల్ని నిర్మించాయి. ఇక్కడే విల్లా ప్రాజెక్టుల్ని నిర్మిస్తున్న సంస్థలూ ఉన్నాయి. కొందరు డెవలపర్లు తక్కువ విస్తీర్ణంలో కడితే మరికొన్ని ఎకరాల్లో నిర్మిస్తున్నాయి. ఈ ప్రాంతాలు గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు నుంచి చేరువగా ఉండటంతో అధిక శాతం మంది డెవలపర్లు కొత్త ప్రాజెక్టుల్ని ఆరంభించారు. తెలంగాణ రెరా అథారిటీ నుంచి తీసుకున్న అనుమతుల్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ ప్రాంతాల్లో ఎంతలేదన్నా 13 నుంచి 14 వేల ఫ్లాట్లు నిర్మాణంలో ఉన్నాయి. వచ్చే మూడేళ్లలోపే కొనుగోలుదారులకు ఫ్లాట్లను హ్యాండోవర్ చేయడానికి పలు సంస్థలు నిర్మాణ పనుల్ని జరిపిస్తున్నాయి.
* హైదరాబాద్‌లో ప్రీ లాంచ్ విష సంస్కృతికి ఆజ్యం పోసిన ప్రాంతాలివే కావడం గమనార్హం. రాత్రికి రాత్రే కోట్లు సంపాదించాలనే దురాశతో.. ఇతర రంగాలకు చెందిన అధిక శాతం మంది డెవలపర్లుగా అవతారం ఎత్తారు. ఇక్కడే కోట్ల రూపాయల్ని వసూలు చేసి నేటికీ ప్రాజెక్టుల్ని ఆరంభించని వారూ ఉన్నారు. కాబట్టి, అలాంటి వారి నుంచి కాకుండా, కేవలం రెరా అనుమతి గల ప్రాజెక్టుల్ని మాత్రమే కొనుగోలు చేయడం ఉత్తమం. ఇక్కడ పేర్కొన్న ప్రాజెక్టుల్లోనూ న్యాయపరమైన అంశాలు, బిల్డర్ గత చరిత్ర, ఇంతకు ముందు కట్టిన నిర్మాణాలు, ప్రస్తుతం చెబుతున్న రేటు, అందులోని సదుపాయాలు వంటి అంశాలన్నీ పక్కాగా చూసుకున్నాకే ఫ్లాట్లను కొనుగోలు చేయడం ఉత్తమం.
ఎంతలేదన్నా 150 ఎకరాల దాకా ఉంటుంది.
This website uses cookies.