Categories: TOP STORIES

ఆధునిక విల్లాలు.. అన్వితా పార్క్ సైడ్‌

అంత‌ర్జాతీయ పోక‌డ‌ల్ని హైద‌రాబాద్‌లో ఒక్కొక్క‌టిగా ప్ర‌వేశ‌పెడుతూ.. త‌మ‌దైన ప్ర‌త్యేక‌త‌ను చాటి చెబుతూ.. అతి త‌క్కువ కాలంలోనే.. కొనుగోలుదారుల మ‌న్న‌న‌ల్ని పొందుతున్న అన్వితా సంస్థ‌.. మేడ్చ‌ల్‌లోని రావ‌ల్‌కోల్‌లో అన్వితా పార్క్ సైడ్ అనే ఆధునిక విల్లా గేటెడ్ క‌మ్యూనిటీకి శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి ఇప్ప‌టికే అన్నిర‌కాల అనుమ‌తులు ల‌భించాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూమి పూజ‌ను 17వ మార్చిన నిర్వ‌హిస్తామ‌ని సంస్థ ఎండీ అచ్చుత‌రావు తెలిపారు. అమెరికా, యూకే వంటి దేశాల్లో ప్రాచుర్యం పొందిన విల్లా క‌మ్యూనిటీల‌ను హైద‌రాబాద్‌లో ప్ర‌వేశ‌పెడుతున్నామ‌ని అన్నారు. పార్కుల చుట్టూ కేంద్రీకృత‌మ‌య్యేలా ప్ర‌త్యేకంగా ఫోర్ బీహెచ్‌కే విల్లాల్ని ఇందులో ప్ర‌ప్ర‌థ‌మంగా డిజైన్ చేశామ‌న్నారు. ఇప్ప‌టికే త‌మ డిజైన్ల‌కు అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల్నుంచి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌న్నారు.

This website uses cookies.