హైదరాబాద్ నిర్మాణ రంగంలో ట్రెండ్ సెట్ చేసేది ఒక సంస్థ అయితే.. దాన్ని ఇతర కంపెనీలు ఫాలో అవుతాయి. ఈ క్రమంలో సాస్ ఇన్‌ఫ్రా ఒక వినూత్న ప్రయోగం చేసింది. హోలీ సందర్భంగా.. కోకాపేట్‌పలోని జి+57 అంతస్తుల ఎత్తు గల సాస్ క్రౌన్ ప్రాజెక్టు మీద హోలి రంగుల్ని వెదజల్లింది. ఇది స్కై స్క్రేపర్ల మీద హోలి బ్లాస్ట్ అని చెప్పొచ్చు. ఈ ఆకర్షణీయమైన సన్నివేశాన్ని సాస్ ఇన్‌ఫ్రా సంస్థ ప్రత్యేకంగా షూట్ చేసింది. ఈ వీడియోను యూట్యూబ్‌లో రెజ్ టీవీలో చూడొచ్చు. వాస్తవానికి, ఈ పోకడ ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాల్లో కనిపిస్తుంది. అయితే, హైదరాబాద్‌లోని ఆకాశహర్మ్యంలో ఇలా హోలి బ్లాస్ట్ చేయడం చూపరుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఇలాంటివి మరికొన్ని కొత్త ట్రెండ్లను హైదరాబాద్లో ప్రవేశపెడతామని సాస్ ఇన్‌ఫ్రా ఎండీ జీవీ రావు తెలిపారు.
This website uses cookies.