Categories: LATEST UPDATES

ప్రైమ్ గ్లోబల్ సిటీస్ లో మూడో స్థానంలో ముంబై

భారత ఆర్థిక రాజధాని ముంబై.. ప్రైమ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ లో మూడో స్థానంలో నిలిచింది. అలాగే గతేడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు 10 శాతం పెరిగాయి. ఇళ్ల ధరలు ఏడాదికి 2.2 శాతం పెరిగినప్పటికీ, బెంగళూరు 20 స్థానం నుంచి 27వ స్థానానికి పడిపోయిందని ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా పేర్కొంది. ముంబై ఇళ్ల ధరలు వార్షిక ప్రాతిపదికన అత్యంత వేగంగా పెరిగాయని వెల్లడించింది. 2022 క్యూ4లో ముంబైలో ఇళ్ల ధరలు 6.4 శాతం పెరిగాయి. దీంతో ఆ ఏడాది ఈ నగరం ఎనిమిదో స్థానంలో నిలిచింది.

మరోవైపు బెంగళూరు 2022 నాలుగో త్రైమాసికంలో 20వ స్థానంలో ఉండగా.. 2023 నాలుగో త్రైమాసికానికి 27 శాతానికి తగ్గింది. ఇక ఢిల్లీ విషయానికి వస్తే.. 2022లో 28వ ర్యాంకులో ఉండగా.. 2023లో 16వ ర్యాంకుకు ఎగబాకింది. ఇక్కడ ఇళ్ల ధరలు 4.2 శాతం పెరిగాయి. ఇక గ్లోబల్ సిటీస్ లో 26.3 శాతం మేర ఇళ్ల ధరల పెరుగదలలో మనీలా మొదటి స్థానంలో నిలిచచింది. 15.1 శాతం పెరుగుదలతో దుబాయ్ రెండో స్థానంలో, 8.6 శాతం పెరుగుదలతో షాంఘై నాలుగో స్థానంలో నిలిచింది.

This website uses cookies.