మార్కెట్‌లో అమ్మకాలతో సంబంధం లేకుండా.. నగరానికి చెందిన మధ్యతరగతి ప్రజానీకం లేదా వేతనజీవులు.. నిత్యం ఎక్కడో ఒక చోట ప్లాట్లను కొంటనే ఉంటారు. వీరిలో చాలామంది భవిష్యత్తు అవసరాల్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుంటారు. పిల్లల ఉన్నత చదువుల కోసం అవసరమయ్యే సొమ్ము నిమిత్తమో లేదా వారి పెళ్లిళ్లకు కావాల్సిన సొమ్ము కోసమో ప్లాట్లను కొనుగోలు చేస్తారు. ఇలాంటి వారు ఎప్పుడూ మార్కెట్‌ను నిశితంగా పరిశీలిస్తుంటారు. ఎక్కడైనా తక్కువ రేటుకు ప్లాటు దొరికితే చాలు.. వెంటనే అందులో పెట్టుబడి పెట్టేస్తారు. కాకపోతే, ప్లాట్ల ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో.. వీరంతా ఆచితూచిగా వ్యవహరిస్తున్నారు. భవిష్యత్తులో రేటు పెరగడానికి కచ్చితమైన అవకాశాలున్న ప్రాంతాల్ని మాత్రమే ఎంచుకుంటున్నారు. మరి, ఇలాంటి వారికోసం నగరంలోని ఏయే ప్రాంతాల్లో ప్లాట్లు దొరకుతున్నాయంటే..
ఇప్పుడు కాకపోయినా.. ఓ పదేళ్లయ్యాకైనా.. ప్లాట్ల ధరలు పెరుగుతాయన్న అంచనాతో చాలామంది.. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో స్థలాల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిన నేపథ్యంలో వీరంతా ఓఆర్ఆర్ నుంచి ఓ నాలుగైదు కిలోమీటర్ల దూరంలో కొనేందుకు సిద్ధపడుతున్నారు. మరికొందరేమో విమానాశ్రాయానికి దగ్గర్లో ఉన్న ప్రాంతాల్ని ఎంచుకునేందుకు అడుగు ముందుకేస్తున్నారు. షాద్ నగర్ నుంచి శంకర్ పల్లి దాకా అనేక మంది యువతీయువకులు ప్లాట్లను ఎంచుకుంటున్నారు. ఇలాంటి వారి కోసం కొత్తూరు, నందిగామ, పటాన్‌చెరు, ఇంద్రేశం, దుండిగల్, మహేశ్వరం వంటి ప్రాంతాలు మంచి ఆప్షన్లుగా బయ్యర్లకు కనిపిస్తున్నాయి. మరి, వీరికోసం ఏయే సంస్థలు ఎంతెంత విస్తీర్ణంలో వెంచర్లు వేశాయంటే..
This website uses cookies.