దక్షిణ భారతదేశంలో.. కేవలం మై హోమ్ కన్‌స్ట్రక్షన్స్ మాత్రమే.. ఫ్లాట్ల అమ్మకాల్లో సరికొత్త రికార్డును సృష్టిస్తుంటుంది. గత దశాబ్దకాలం నుంచి ఈ కంపెనీ మొదటి రోజు అమ్మినన్నీ ఫ్లాట్లు.. ఇప్పటివరకూ ఏ సంస్థా విక్రయించలేదంటే అతిశయోక్తి కాదు. మదీనాగూడలోని మై హోమ్ జ్యుయల్ నుంచి సంస్థ ఆరంభించిన ప్రతి ప్రాజెక్టుకు కొనుగోలుదారులు బ్రహ్మరథం పట్టారు. ఎందుకంటే, ఈ సంస్థ ప్రాజెక్టును ప్రారంభించిందంటే.. టైమ్లీ డెలివరి చేస్తుందనే ఖ్యాతినార్జించింది. తాజాగా, మై హోమ్ సంస్థ తెల్లాపూర్‌లో ఆరంభించిన మై హోమ్ అక్రిద ప్రాజెక్టులో ఫ్లాట్లను కొనేందుకు ప్రజలు క్యూ కట్టారు. తెల్లాపూర్‌లో ఆదివారం బుకింగును ప్రారంభించిందో లేదో ఫ్లాట్లను బుక్ చేసుకోవడానికి ప్రజలు ఎగబడ్డారు.
మై హోమ్ సంస్థ.. అక్రిద ప్రాజెక్టులో.. ఫస్ట్ ఫేజులో భాగంగా.. కేవలం ఆరు బ్లాకుల్ని ఆరంభించింది. అందులో అమ్మకానికి పదిహేను వందల ఫ్లాట్లను పెట్టగా.. వాటిలో పద్నాలుగు వందల ఫ్లాట్లు ఇరవై నాలుగు గంటల్లో అమ్ముడయ్యాయి. తొలుత రెండున్నర లక్షల రూపాయలు బుకింగ్ ఎమౌంట్ చెల్లించి హోమ్ బయ్యర్స్ ఫ్లాట్లను సొంతం చేసుకున్నారు. వీటిలో యాభై నుంచి అరవై శాతం పాత కస్టమర్లు కాగా.. మిగతావారు కొత్తవారే. మొత్తానికి, మార్కెట్ ప్రతికూలంగా ఉన్న సమయంలో.. ఇరవై నాలుగు గంటల్లో పద్నాలుగు వందల ఫ్లాట్లను విక్రయించి.. హైదరాబాద్ రియల్ రంగానికి సరికొత్త ఉత్సాహాన్నిచ్చిన ఘనత.. మై హోమ్ సంస్థకే దక్కుతుంది.
This website uses cookies.