బిల్డర్ నుంచి ఇల్లు కొన్న తర్వాత అందులో తలెత్తే నిర్మాణపరమైన లోపాలకు సంబంధించి ఎంతకాలం వరకు బిల్డర్ బాధ్యత ఉంటుంది? ఈ ప్రశ్నకు కర్ణాటక రెరా ఇటీవల స్పష్టమైన ఆదేశాలిచ్చింది. రెసిడెంట్స్ అసోసియేషన్ ఏర్పడి, కొనుగోలుదారులకు ప్రాజెక్టు అప్పగించిన తర్వాత ఐదేళ్ల పాటు నిర్మాణపరమైన లోపాలను పరిష్కరించే బాధ్యత డెవలపర్ దేనని పేర్కొంది. బెంగళూరు సర్జాపూర్ లోని ఎన్ఎన్ఆర్ వెరిటీలో ఫ్లాట్ కొనుగోలు చేసిన వ్యక్తి.. తన అపార్ట్ మెంట్ లోకి వర్షపు నీరు లీక్ అవుతోందని, ఈ విషయాన్ని ప్రాజెక్టు డెవలపర్ ఎస్ఎన్ఆర్ స్క్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ దృష్టికి తీసుకెళ్లినా స్పందించడంలేదంటూ రెరాను ఆశ్రయించారు.
పంకజ్ సింగ్ అనే వ్యక్తి 2021లో ఫ్లాట్ కు సంబంధించి సేల్ డీడ్ చేసుకోగా.. 2022లో అందులోకి మారారు. అయితే, వర్షపు నీటి లీకేజీతో తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. డెవలపర్ కు ఈ విషయంపై అనేకసార్లు చెప్పినా స్పందన రాలేదు. దీంతో ఆయన రెరాలో ఫిర్యాదు చేశారు. అన్ని అంశాలనూ కూలంకషంగా పరిశీలించిన రెరా అథార్టీ.. రెసిడెంట్స్ అసోసియేషన్ ఏర్పడిన తర్వాత కూడా ఐదేళ్లపాటు వెలుగులోకి వచ్చే నిర్మాణపరమైన లోపాలను సరిదిద్దాల్సిన బాధ్యత డెవలపర్ దేనని స్పష్టంచేసింది. ప్రాజెక్టును హౌసింగ్ అసోసియేషన్కు అప్పగించిన తర్వాత చాలామంది డెవలపర్లు తమ బాధ్యతలను విస్మరిస్తున్నారని, ఇది సరికాదని నిపుణులు పేర్కొంటున్నారు. చాలామంది డెవలప
This website uses cookies.