ప్రకృతిలో నివసించాలని భావించేవారికి మై హోమ్ సంస్థ..మై హోమ్ విపినా అనే ప్రాజెక్టును తెల్లాపూర్‌లో ఆరంభించింది. తెలిసిన కొనుగోలుదారులకు ఈ సంస్థ అందజేస్తోన్న ఆఫర్ ధర ఎంతో తెలుసా? ఆ రేటు వింటే మీరు ఎగిరి గంతేయడం ఖాయం. సుమారు 20.61 ఎకరాల్లో దాదాపు 3720 ఫ్లాట్లను ఈ ప్రాజెక్టులో నిర్మిస్తోంది. ఇందులో వచ్చేవి ఎనిమిది టవర్లు. ఒక్కో టవర్ అంతస్తు జి+ 46 అంతస్తులు. 2, 2.5 మరియు 3 బీహెచ్‌కే ఫ్లాట్లకు ఈ ప్రాజెక్టులో పెద్దపీట వేసింది. 2 బెడ్రూమ్ ఫ్లాట్ల విస్తీర్ణం 1325 చదరపు అడుగులు కాగా.. 2.5 బీహెచ్‌కే ఫ్లాట్లు 1655 చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నారు. ఇక త్రీ బెడ్‌రూమ్ ఫ్లాట్లు 2095 మరియు 2180 చదరపు అడుగుల్లో కడుతున్నారు. ప్రతి లాబీ టవర్ ఎంట్రెన్స్ డబుల్ హైట్‌లో ఉండేలా డిజైన్ చేశారు.
మై హోమ్ విపినా ప్రాజెక్టులో ఔట్‌డోర్ ఎమినిటీస్‌కు సంస్థ పెద్దపీట వేసింది. ఇందులో క్రికెట్ ప్రాక్టీస్ నెట్, టెన్నిస్ కోర్టులు, ఓపెన్ జిమ్, టెంపరేచర్ కంట్రోల్డ్ స్విమ్మింగ్ పూల్, జాగింగ్/వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, బాస్కెట్‌బాల్ కోర్టు, సీటింగ్ ఏరియాస్, పెట్ జోన్, స్కేటింగ్ రింక్ వంటివి పొందుపరుస్తారు.
మై హోమ్ సంస్థ ప్రత్యేకత ఏమిటంటే.. ఆధునిక సదుపాయాలకు ఎప్పుడూ పెద్దపీట వేస్తుంది. క్లబ్ హౌజ్ టెర్రస్ మీద ఫుట్సల్ కోర్టు మరియు టెన్నిస్ కోర్టును డెవలప్ చేస్తోంది. జిమ్, మల్టీపర్పస్ హాళ్లు, యోగా మరియు ఏరోబిక్స్ హాళ్లు, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టులు, స్క్వాష్ కోర్టు, ఇండోర్ గేమ్స్, గెస్ట్ రూమ్స్ వంటివి డెవలప్ చేస్తారు. ఇందులోనే కన్వీనియన్స్ స్టోర్, ఫార్మసీ, స్పా, సెలూన్, బ్యాంకు లేదా ఏటీఎం వంటివి పొందుపరుస్తారు.
రియల్ ఎస్టేట్ గురుకి అందిన సమాచారం ప్రకారం.. మొదటి ఐదు వందల మంది కస్టమర్లకు చదరపు అడుక్కీ రూ.6,300కి ఫ్లాట్లను విక్రయిస్తోంది. ఆ తర్వాత ఫ్లాట్లను చదరపు అడుక్కీ రూ.6500 చొప్పున అమ్ముతోంది. ఆరో అంతస్తు నుంచి 24వ అంతస్తు దాకా ఫ్లోర్ రైజ్ ఛార్జీలు రూ.20 చొప్పున వసూలు చేస్తున్నారు. 25 నుంచి 30వ అంతస్తు దాకా చదరపు అడుక్కీ రూ.400 .. 31 నుంచి 40 అంతస్తుల వరకూ రూ.500.. 41 నుంచి 46 అంతస్తుల వరకూ చదరపు అడుక్కీ రూ.600 చొప్పున తీసుకుంటున్నారు. అమినీటీస్ కోసం చదరపు అడుక్కీ రూ.250, కార్ పార్కింగ్ అయితే బేస్‌మెంట్‌ను బట్టి రూ.2 నుంచి రూ.3.5 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. కార్పస్ ఫండ్ చదరపు అడుక్కీ రూ.75, మొదటి రెండేళ్లు మెయింటనెన్స్ రూ.72 తీసుకుంటున్నారు.
This website uses cookies.