Categories: LATEST UPDATES

ఏ రాజకీయ పార్టీతో మాకు సంబంధం లేదు

  • ఐటీ దాడుల నేపథ్యంలో జీ స్క్వేర్ వివరణ

తమకు ఏ రాజకీయ పార్టీతో కానీ, రాజకీయ పార్టీ నేతల కుటుంబంతో కానీ సంబంధం లేదని జీ స్క్వేర్ కంపెనీ వివరణ ఇచ్చింది. ఇటీవల ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో తమ కంపెనీకి సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను ఖండించింది. ఈ మేరకు జీ స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ బాల అలియాస్ రామజేయం ఓ ప్రకటన విడుదల చేశారు.

‘ఇటీవల మా కంపెనీలో జరిగిన ఐటీ సోదాలు పలు వివరాలు తెలుసుకోవడంలో చేసిన ఓ ప్రామాణిక ప్రక్రియ. మేం పన్ను చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా అనేక రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఇటీవల ఇలాంటి సోదాలే జరిగాయి. ఈ సోదాల్లో మా కంపెనీకి ఏ రాజకీయ పార్టీతోకానీ, అలాంటి పార్టీల కుటుంబ సభ్యులతో కానీ ఎలాంటి సంబంధం లేదని తేలింది. అంతేకాకుండా మాపై వచ్చిన తప్పుడు ఆరోపణలను ఈ సోదాలు పూర్తిగా తొలగించాయి. ప్రజలకు నిజాలు తెలియడానికి ఈ సోదాలు మాకు వచ్చిన ఓ చక్కని అవకాశంగా భావిస్తున్నాం. వీటి తర్వాత పూర్తిగా ఉపశమనం పొందాం’ అని అందులో పేర్కొన్నారు. తాము ఎల్లప్పుడూ అత్యున్నత నైతిక ప్రమాణాలతోనే కట్టుబడి పనిచేసినట్టు చెప్పారు. అయితే, కొన్ని వార్తా చానళ్లు, వ్యక్తులు స్వార్థ ప్రయోజనాలతో తప్పుడు, హానికరమైన సమాచారాన్ని వ్యాప్తి చేశాయని విచారం వ్యక్తంచేశారు. ఇందులో ఏవో దురుద్దేశాలు ఉన్నాయని ఆరోపించారు.

This website uses cookies.