poulomi avante poulomi avante

రియల్ అంబాసిడర్ గా బాలయ్య?

ఆహో ఓటీటీలో అన్ స్టాపబుల్ చాట్ షో ద్వారా దుమ్ము రేపుతున్న సినీ హీరో నందమూరి బాలకృష్ణ త్వరలోనే మరో పాత్రలో కనిపించనున్నారు. సినిమాలు తప్ప బయట ఎలాంటి వాణిజ్య ప్రకటనల్లో కనిపించని బాలయ్య.. అన్ స్టాపబుల్ ద్వారా తానేంటో నిరూపించుకున్నారు. త్వరలో వాణిజ్య ప్రకటనల్లో కనిపించబోతున్నార‌ని స‌మాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టుల్ని చేప‌డుతున్న ఓ సంస్థ‌కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నారని తెలుస్తోంది.

దీనికి సంబంధించిన షూటింగ్ తాజాగా పూర్తయిందని సమాచారం. 1990 చివర్లో, 2000 దశకం ప్రారంభంలో తమ బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయాలని బాలయ్యను కొంతమంది కూల్ డ్రింకు కంపెనీలు సంప్రదించారని అప్పట్లో వార్తలొచ్చాయి. తర్వాత 2010లో ఓ ఆల్కహాల్ సంస్థ తమ మినరల్ వాటర్ బ్రాండ్ ప్రచారం కోసం బాలయ్యను సంప్రదించారనే వార్తలు వచ్చాయి. అయితే, ఆయన అన్నింటినీ తిరస్కరించారు. తాజాగా రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రచారానికి అంగీకరించారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles