poulomi avante poulomi avante

రియ‌ల్ టెక్నాల‌జీ మారుతోంది!

యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఒకసారి ఇలా అన్నారు, ‘నిన్న జరిగినదాని గురించి చింతించకుండా రేపు కనిపెడదాం’. అదే విధంగా రియల్ ఎస్టేట్ రంగంలోని పాత, కొత్త సంస్థలు కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా, పెరుగుతున్న పోటీతత్వాన్ని తట్టుకుని నిలబడాలంటే టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. రియల్ పరిశ్రమ గత దశాబ్ద కాలంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో టెక్నాలజీ వైపు అడుగులు వేస్తోంది. నేటి డిజిటల్ యుగంలో చాలా వ్యాపారాల్లో సాంకేతికత పాత్ర కీలకంగా మారింది. కరోనా నేపథ్యంలో అనేక సంస్థల డిజిటల్ విప్లవ వ్యూహాలు వేగవంతమయ్యాయి. ఈ విషయంలో రియల్ పరిశ్రమ మినహాయింపు కాదు. అభివృద్ధి చెందుతున్న టెక్నాల‌జీ ఆధారిత మార్కెట్‌ను స్వీకరించే విషయంలో చురుకుగా వ్యవహరించే వాటిలో ల్యాండ్ స్కేప్ ఆదర్శప్రాయంగా ఉంది.

సాంకేతికత అనేది మ‌న‌ ప్రవర్తన యొక్క ప్రతి అంశాన్ని శక్తివంతం చేస్తోంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు పురోగతితో రియల్ ఎస్టేట్ రంగంలో దాని పాత్ర పెరుగుతోంది. వివిధ పరిశ్రమల అభివృద్ధికి కొత్త కొత్త సాంకేతికతలను ఎల్లప్పుడూ దోహదం చేస్తాయనడంతో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఈ మార్పును ఏ పరిశ్రమా వద్దనుకోదు. సాంకేతికతను స్వీకరించడం వల్ల దీర్ఘకాలంలో ఆదాయంపై మంచి ముద్ర పడుతుంది. 2000 ప్రారంభంలో ఇళ్ల కొనుగోలు, అమ్మకం, అద్దెలకు సంబంధించి ఆన్ లైన్ క్లాసిఫైడ్ ల ప్రారంభంతో భారతీయ ప్రాపర్టీ మార్కెట్ విస్తృతమైన సాంకేతికతను అందిపుచ్చుకుంది. అప్పటి నుంచి దేశంలో ప్రాప్ టెక్ స్పేస్ నెమ్మదిగా అభివృద్ధి చెందింది.

కో-లివింగ్, కో-వర్కింగ్ వంటి కొత్త వ్యాపార విధానాలను పక్కనపెడితే, ప్రాప్ టెక్ రంగంలో పెద్దగా ఆవిష్కరణలు లేవు. మనదేశంలో అతిపెద్ద అంశమైన రియల్ ఎస్టేట్ లో ఇలాంటి పరిస్థితి చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్ కంపెనీ ఉద్యోగులు, వినియోగదారులు ముఖాముఖిగా వ్యవహరించే సంప్రదాయ విధానంలోనే రియల్ ఎస్టేట్ రంగం అనేక సంవత్సరాలుగా పనిచేస్తోంది. గత మూడేళ్లలో రియల్ ఎస్టేట్ రంగం ‘రియల్ లైఫ్’ నుంచి ‘రియల్ టైమ్’కి మారడం మాత్రం అసాధారణం. కోవిడ్ అనేది రియల్ ఎస్టేట్ లో టెక్నాలజీ పెరగడానికి బాగా దోహదపడింది. పర్యవసానంగా మార్కెట్ లో వస్తున్న సరికొత్త ట్రెండ్, ప్రాప్ టెక్, చాలా రియల్టీ సంప్రదాయాలను వేగంగా పునర్ నిర్మిస్తోంది. కరోనా కారణంగా వినియోగదారుల ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి. డిజిటలైజ్డ్ ఫార్మాట్ లో రియల్ ఎస్టేట్ డేటా లభ్యత, ఏఈర్, వీఆర్ టెక్నాలజీలో మెరుగుదలలు రియల్ పురోగతిని వేగవంతం చేస్తాయి. డిజిటల్ లావాదేవీలు, వర్చువల్ హోం టూర్లకు డిమాండ్ ఆల్ టైం గరిష్టంగా ఉంది. త్రీడీ రెండర్లు, వర్చువల్ వాక్ త్రూలు దేశంలోని అత్యధిక రియల్ ఎస్టేట్ డెవలపర్ల నుంచి ప్రామాణిక ఆఫర్ గా మారాయి.
ఈ రోజుల్లో దాదాపు ప్రతి రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు డిజిటల్ మార్కెటింగ్, సాంకేతికత, ఫైనాన్సింగ్, నిర్మాణంతోపాటు సంప్రదాయ మార్కెటింగ్ ద్వారా ప్రభావితమవుతున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికత పరిష్కారాల ద్వారా అటు కొనుగోలుదారులు, ఇటు అమ్మకందారులు లబ్ధి పొందే అవకాశం ఉంది. పైగా ఇవి తక్కువ ఖర్చుతో కూడుకున్నవే కాకుండా రెండు పార్టీలను సులభంగా కలిసేలా చేస్తాయి. మొత్తానికి డెవలపర్లు, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్లు చిన్న నగరాల్లో కూడా డిజిటల్ విధానాలను ప్రోత్సహించాలి. ఇది చిన్న పట్టణాల్లో ఇళ్ల డిమాండ్, సరఫరా పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి ప్రభుత్వం గత మూడేళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో సంస్కరణలు తీసుకొస్తోంది. అయినప్పటికీ, ఈ రంగం దీర్ఘకాలంపాటు ఎలాంటి అవాంతరాలు లేకుండా మనుగడ సాగించడానికి డిజిటలైజేషన్ వైపు మళ్లించేందుకు వీలుగా ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles