Naredco Silver Jubilee celebrations in hyderabad
కొవిడ్ కారణంగా నిలిచిపోయిన రియాల్టీ ప్రాజెక్టులకు కేంద్రం ఒకేసారి రుణ పునర్ వ్యవస్థీకరణ చేయాలని నరెడ్కో కోరింది. ఇటీవల నరెడ్కో ఉత్తర్ ప్రదేశ్ ఛైర్మన్ ఆర్ కే అరోరా తో కూడిన బ్రుందం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ని ప్రత్యేకంగా కలిశారు. దివాలా చట్టంలోని కొన్ని నిబంధనలను మరో ఏడాది పొడిగించాలని డిమాండ్ చేసింది. కరోనా మహమ్మారి మరియు దీర్ఘకాలిక లాక్డౌన్ వలన కలిగే సవాళ్లను ఎదుర్కోవటానికి ప్రభుత్వం నుండి రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన వివిధ అంచనాలను కలిగి ఉన్న వినతి పత్రాన్ని నరెడ్కో సమర్పించింది. మహమ్మారి కారణంగా రియల్ ఎస్టేట్ రంగంలో తీవ్రమైన నిధుల సంక్షోభం గురించి ప్రతినిధి బృందం ఆర్థిక మంత్రికి సమాచారం ఇచ్చిందని అరోరా తెలిపారు.
This website uses cookies.